ఒక్కరోజులో రూ.72 వేలు తగ్గిన వెండి, 2 శాతం క్షీణించిన బంగారం

  • లాభాల స్వీకరణకు మొగ్గు చూపిన ఇన్వెస్టర్లు
  • ఢిల్లీలో 19 శాతం తగ్గి రూ.3.12 లక్షలకు పడిపోయిన వెండి
  • రూ.1.65 లక్షలకు పడిపోయిన బంగారం ధర
బంగారం, వెండి ధరలు శనివారం భారీగా పతనమయ్యాయి. గత కొన్ని రోజులుగా ఈ ఖరీదైన లోహాలు అమాంతం పెరిగిన విషయం తెలిసిందే. దీంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపుతుండటంతో రెండు రోజులుగా బంగారం, వెండి ధరలు క్షీణిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఈ రోజు కిలో వెండి ధర 19 శాతం నష్టపోయి రూ.3.12 లక్షలు, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 2 శాతం క్షీణించి రూ.1.65 లక్షలు పలికింది.

ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం వెండి ధర కిలో 18.85 శాతం లేదా రూ.72,500 క్షీణించి రూ.3,12,000 పలికింది. గత కొన్ని రోజులుగా ఆకాశాన్నంటేలా పెరుగుతున్న వెండి ధరలు వరుసగా రెండు రోజులు భారీ నష్టాన్ని చూశాయి. గురువారం కిలో వెండి ధర రూ.4 లక్షలు దాటింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు 11 శాతం పడిపోయాయి. కామెక్స్‌లో వెండి ధర 31 శాతం క్షీణించింది.


More Telugu News