డాక్టర్ నోరి దత్తాత్రేయుడికి మెగాస్టార్ చిరంజీవి ఆతిథ్యం
- ప్రముఖ కేన్సర్ వైద్య నిపుణుడు నోరి దత్తాత్రేయుడితో మెగాస్టార్ చిరంజీవి భేటీ
- పద్మభూషణ్ పురస్కారం అందుకున్న డాక్టర్ నోరికి చిరంజీవి శుభాకాంక్షలు
- తన నివాసంలో డాక్టర్ నోరికి ఆతిథ్యం ఇచ్చి సత్కరించిన మెగాస్టార్
- ఆయన సేవా ప్రయాణం, అంకితభావం తరతరాలకు స్ఫూర్తి అని కొనియాడిన చిరు
ప్రముఖ కేన్సర్ వైద్య నిపుణుడు, పద్మభూషణ్ పురస్కార గ్రహీత డాక్టర్ నోరి దత్తాత్రేయుడితో మెగాస్టార్ చిరంజీవి భేటీ అయ్యారు. ఇటీవల పద్మభూషణ్ పురస్కారం అందుకున్న డాక్టర్ నోరి దత్తాత్రేయుడిని చిరంజీవి తన నివాసానికి ఆహ్వానించి, ఆతిథ్యం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో సత్కరించి, ప్రత్యేక అభినందనలు తెలిపారు.
ఈ భేటీపై చిరంజీవి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తన సంతోషాన్ని పంచుకున్నారు. "అధునాతన కేన్సర్ చికిత్సలో అసాధారణమైన సేవలకు గాను 'పద్మభూషణ్' గౌరవం పొందిన డాక్టర్ నోరి దత్తాత్రేయుడు గారికి ఆతిథ్యం ఇవ్వడం, ఆయనతో అద్భుతమైన క్షణాలను గడపడం గౌరవంగా భావిస్తున్నాను. ఆయన సేవా ప్రయాణం, అంకితభావం, నిజాయతీ తరతరాలకు నిజమైన స్ఫూర్తిగా నిలుస్తాయి. ఆయనకు నా హృదయపూర్వక అభినందనలు, ప్రగాఢ గౌరవాన్ని తెలియజేస్తున్నాను" అని పేర్కొన్నారు.
ఈ భేటీకి సంబంధించిన ఫొటోలను చిరంజీవి షేర్ చేయడంతో అవి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.