ఏప్రిల్ 30 నాటికి అయోధ్య రామాలయం అన్ని పనులు పూర్తి: నిర్మాణ కమిటీ ఛైర్మన్

  • ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.1,900 కోట్లుగా అంచనా వేసినట్లు వెల్లడి
  • రూ.1,600 కోట్లు ఇప్పటికే చెల్లించామన్న నిర్మాణ కమిటీ ఛైర్మన్
  • ఏప్రిల్ 30 నాటికి పేపర్ వర్క్, బిల్లు చెల్లింపులు పూర్తవుతాయన్న ఛైర్మన్
అయోధ్యలోని రామాలయానికి సంబంధించిన అన్ని నిర్మాణ పనులు ఏప్రిల్ 30 నాటికి పూర్తవుతాయని, ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం దాదాపు రూ.1,900 కోట్లుగా అంచనా వేసినట్టు రామాలయ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా తెలిపారు. ఆలయ నిర్మాణానికి సంబంధించి ఎల్ అండ్ టీ, టీసీఎస్ కంపెనీలు మూడేళ్ల కాలానికి ఒప్పందం చేసుకున్నాయని ఆయన వెల్లడించారు.

రామాలయంలో మిగిలిన పనులు వేగంగా సాగుతున్నాయని, మరో మూడు నెలల్లో అవి పూర్తవుతాయని తెలిపారు. రూ.1,900 కోట్లకు గాను ఇప్పటి వరకు రూ.1,600 కోట్లు చెల్లించినట్లు తెలిపారు. ఏప్రిల్ 30 నాటికి పేపర్ వర్క్, బిల్లు చెల్లింపులు కూడా పూర్తవుతాయని అన్నారు. ఆ తర్వాత ఆలయం శ్రీరామ జన్మభూమి ఆలయ ట్రస్ట్ పరిధిలోకి వస్తుందని వెల్లడించారు.


More Telugu News