శరద్ పవార్‌తో అజిత్ పవార్ కలిసిపోవాలనుకున్నారా? పార్టీ సీనియర్ నేత ఏం చెప్పారంటే?
- మహారాష్ట్రలో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలు
- ఎన్సీపీ, ఎన్సీపీ (ఎస్పీ) కలవాలని అజిత్ పవార్ భావించారని ప్రచారం
- శరద్ పవార్, అజిత్ పవార్‌ల భేటీలో ఈ అంశం చర్చకు వచ్చినట్లు ప్రచారం
- పవార్‌ల మధ్య విలీనం అంశం చర్చకు రాలేదన్న ఎన్సీపీ కీలక నాయకుడు
మహారాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మృతి చెందడంతో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కొన్ని రోజుల క్రితం ఎన్సీపీ(ఎస్పీ) అధినేత శరద్ పవార్‌తో ఎన్సీపీ అధ్యక్షుడు అజిత్ పవార్ భేటీ అయ్యారని, వారి మధ్య పార్టీల విలీనం గురించి చర్చ జరిగిందనే ప్రచారం జరిగింది. ఈ ప్రచారంపై ఎన్సీపీ (అజిత్ పవార్) పార్టీ ముఖ్య నాయకుడు, పార్టీ మహారాష్ట్ర చీఫ్ సునీల్ టత్కారే స్పందించారు.
శరద్ పవార్, అజిత్ పవార్‌ల భేటీలో పార్టీల విలీనంపై ఎలాంటి చర్చ జరగలేదని సునీల్ స్పష్టం చేశారు. ఈ నెలలో ఇరువురి మధ్య జరిగిన సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలు, వ్యవసాయ సంబంధిత అంశాలపై చర్చించారని స్పష్టం చేశారు. విలీనం గురించి ఎలాంటి చర్చ జరగలేదని అన్నారు.
ఫిబ్రవరి 12న పార్టీల విలీనం ప్రకటించే ఉద్దేశంతో ఇటీవల శరద్ పవార్, అజిత్ పవార్ సమావేశమయ్యారని గతంలో వార్తలు వచ్చాయి. ఆ ప్రచారాన్ని మహారాష్ట్ర ఎన్సీపీ అధ్యక్షుడు సునీల్ ఖండించారు. కొన్ని రోజుల క్రితం పార్టీల విలీనం గురించి మీడియా అడిగిన ప్రశ్నకు శరద్ పవార్ స్పందిస్తూ, అజిత్ పవార్, జయంత్ పాటిల్ మధ్య చర్చలు జరుగుతున్నాయని, పాటిల్ నిర్ణయం తీసుకుంటారని అన్నారు.
అజిత్ పవార్ పార్టీలు విలీనం కావాలని కోరుకున్నారని ఎన్సీపీ (ఎస్పీ) సీనియర్ నాయకుడు జయంత్ పాటిల్ కూడా పేర్కొన్నారు. అజిత్ పవార్ పలుమార్లు తనను ఆయన ఇంటికి ఆహ్వానించారని, తనకు లంచ్ ఏర్పాటు చేశారని, అదే సమయంలో పార్టీల విలీనం గురించి చర్చించారని అన్నారు.