ఏపీలో వేగవంతంగా ఫింఛన్ల పంపిణీ ..10.30 గంటల సమయానికే 60 శాతం పంపిణీ
- ఏపీలో ఒక రోజు ముందుగానే పింఛన్ల పంపిణీ
- లబ్దిదారుల ఇళ్ల వద్దనే పింఛన్లు పంపిణీ చేస్తున్న గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది
- గుడిపల్లి మండలం బెగ్గిలపల్లె లో జరిగిన పింఛన్ల పంపిణీలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వేగవంతంగా జరుగుతోంది. ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం కావడంతో ఒక రోజు ముందుగానే పింఛన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫిబ్రవరి నెలకు సంబంధించి పింఛన్ల పంపిణీ ఈ రోజు ఉదయం నుంచి లబ్దిదారుల ఇళ్ల వద్దనే గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది పంపిణి చేస్తున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గ పరిధిలోని గుడిపల్లి మండలం బెగ్గిలపల్లె లో జరిగిన పింఛన్ల పంపిణీలో పాల్గొని లబ్దిదారులకు నేరుగా పింఛన్లు అందజేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా 62,94,844 పింఛన్ లబ్దిదారులకు గానూ ఉదయం 10.30 గంటల సమయానికి 38,18,798 (60.67శాతం) మందికి పంపిణీ జరిగింది.