ఇది ఎక్సలెంట్ న్యూస్: సీఎం చంద్రబాబు
- 'ఐగాట్ కర్మయోగి' ప్లాట్‌ఫామ్‌లో ఏపీ సరికొత్త రికార్డు
- కోటికి పైగా ఎన్‌రోల్‌మెంట్లు పూర్తి చేసిన తొలి రాష్ట్రంగా ఘనత
- ప్రభుత్వ ఉద్యోగుల నిబద్ధతను కొనియాడిన సీఎం చంద్రబాబు
- నైపుణ్యం గల పరిపాలన కోసమే ఈ కార్యక్రమమని వెల్లడి
- ఈ ఘనతలో ఏపీఎస్‌డీపీఎస్ పాత్రను అభినందించిన సీఎం
ప్రభుత్వ ఉద్యోగుల నైపుణ్యాలను పెంచే 'ఐగాట్ కర్మయోగి' పోర్టల్‌లో ఆంధ్రప్రదేశ్ సరికొత్త రికార్డు సృష్టించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఇది అద్భుతమైన వార్త అని, ప్రభుత్వ ఉద్యోగులు నిరంతర అభ్యాసంపై చూపుతున్న నిబద్ధతకు ఈ ఘనత నిదర్శనమని ఆయన అన్నారు. నైపుణ్యం, చురుకుదనం, భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా పరిపాలనను నిర్మించడమే తమ లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు.
ఐగాట్ కర్మయోగి ప్లాట్‌ఫామ్‌పై కోటికి పైగా కోర్సు ఎన్‌రోల్‌మెంట్లు, 80 లక్షలకు పైగా కోర్సుల పూర్తితో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని ఉద్యోగులు మొత్తం 4,290 కోర్సులలో ఈ శిక్షణ పూర్తిచేశారు. ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా ముందుకు నడిపిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సంస్థను (APSDPS) సీఎం ప్రత్యేకంగా అభినందించారు.
కేంద్ర ప్రభుత్వం సైతం ఆంధ్రప్రదేశ్ సాధించిన ఈ ఘనతను ప్రశంసించింది. ఉద్యోగుల సామర్థ్యాన్ని పెంచడం ద్వారా పౌర సేవలపై సానుకూల ప్రభావం చూపడంలో రాష్ట్రం ముందుందని కొనియాడింది. ఏపీ సాధించిన ఈ విజయం దేశంలోని ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొంది. ఉద్యోగులకు శిక్షణ ఇచ్చి వారి సామర్థ్యాన్ని పెంపొందించడంలో రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తున్న నిబద్ధతకు ఇది నిలువుటద్దమని నిపుణులు విశ్లేషిస్తున్నారు.