ఆ విమానం అతను నడపాల్సింది కాదు.. కానీ చివరకు!
- ట్రాఫిక్‌లో చిక్కుకున్న మరో పైలట్
- చివరి నిమిషంలో విధుల్లోకి చేరిన కెప్టెన్ సుమిత్ కపూర్
- చేతికి ఉన్న బ్రాస్‌లెట్ ఆధారంగా సుమిత్ కపూర్‌ను గుర్తించిన స్నేహితులు
- ప్రాథమిక విచారణలో పైలట్ అంచనా తప్పిందని భావన
- అనుభవం ఉన్న సుమిత్ తప్పు చేసే అవకాశం లేదంటున్న ఆత్మీయులు
మహారాష్ట్ర రాజకీయ సంచలనం అజిత్ పవార్ ప్రాణాలు కోల్పోయిన విమాన ప్రమాదంలో పైలట్ కెప్టెన్ సుమిత్ కపూర్ మృతి వెనుక విషాదకరమైన కోణం వెలుగులోకి వచ్చింది. నిజానికి ఆ విమానాన్ని సుమిత్ నడపాల్సింది కాదని, కేవలం ఒక యాదృచ్ఛిక ఘటన అతడిని మృత్యువు ఒడికి చేర్చిందని ఆయన స్నేహితులు వెల్లడించారు.
ఢిల్లీలో జరిగిన సుమిత్ కపూర్ అంత్యక్రియల సందర్భంగా ఆయన మిత్రులు పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అసలు విమానం నడపాల్సిన పైలట్ ముంబై ట్రాఫిక్‌లో చిక్కుకుపోవడంతో, కేవలం కొన్ని గంటల ముందు సుమిత్‌కు పిలుపు వచ్చింది. కొన్ని రోజుల క్రితమే హాంగ్ కాంగ్ నుంచి వచ్చిన కపూర్.. సంస్థ ఆదేశాలను పాటించి అజిత్ పవార్‌ను బారామతికి తీసుకెళ్లేందుకు విమానం ఎక్కారు. కానీ అదే ఆయనకు చివరి ప్రయాణం అవుతుందని ఎవరూ ఊహించలేదు.
ముంబై నుంచి బయలుదేరిన 'లియర్ జెట్ 45' విమానం బారామతి విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యే క్రమంలో ప్రమాదానికి గురైంది. పొగమంచు వల్ల సరిగ్గా కనిపించకపోవడంతో రెండోసారి ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తున్నప్పుడు ఈ ఘోరం జరిగింది. ఈ ప్రమాదంలో సుమిత్ కపూర్‌తో పాటు కో-పైలట్ శాంభవి పాఠక్, అసిస్టెంట్ పింకీ మాలి, సెక్యూరిటీ గార్డ్ విదిప్ జాదవ్, అజిత్ పవార్ అక్కడికక్కడే మరణించారు.
వాయవ్య వాతావరణ పరిస్థితుల వల్ల 'పైలట్ అంచనా తప్పి ఉండొచ్చు' అని ప్రాథమిక విచారణ సంస్థలు భావిస్తుండగా, సుమిత్ స్నేహితులు దీన్ని కొట్టిపారేస్తున్నారు. ఆయనకు వేల గంటల విమానయాన అనుభవం ఉందని, సాంకేతిక లోపం లేదా ఇతర కారణాలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రమాదం ఎంత భయంకరంగా జరిగిందంటే.. మృతదేహం గుర్తుపట్టలేనంతగా కాలిపోగా, సుమిత్ చేతికి ఉన్న బ్రాస్‌లెట్ చూసి ఆయనను గుర్తించాల్సి వచ్చింది.
సుమిత్ కపూర్ కుటుంబమంతా పైలట్లతో నిండి ఉంది. ఆయన కుమారుడు, అల్లుడు కూడా పైలట్లుగా పనిచేస్తున్నారు. విమానాలంటే ప్రాణమిచ్చే సుమిత్, చివరకు ఆ ఆకాశంలోనే కలిసిపోవడం ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తింది. "చనిపోవడానికి కొద్దిసేపటి ముందే తన ఆరోగ్యం గురించి జాగ్రత్తలు చెప్పాడని, ఇంతలోనే ఇలా జరుగుతుందని నమ్మలేకపోతున్నాం" అని ఆయన మిత్రుడు జి.ఎస్. గ్రోవర్ ఆవేదన వ్యక్తం చేశారు.