బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టులో ఐబొమ్మ రవి పిటిషన్

  • నాంపల్లి కోర్టులో పలుమార్లు బెయిల్ పిటిషన్లు దాఖలు చేసిన రవి
  • కేసు తీవ్రత దృష్ట్యా పిటిషన్లను కొట్టివేసిన నాంపల్లి కోర్టు
  • తాజాగా హైకోర్టును ఆశ్రయించిన ఐబొమ్మ రవి
సినిమా పైరసీ వెబ్‌సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు రవి తెలంగాణ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. నాంపల్లి కోర్టులో పలుమార్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేసినప్పటికీ చుక్కెదురైంది. దీంతో తాజాగా హైకోర్టును ఆశ్రయించాడు.

రవి పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలంటూ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. సైబర్ క్రైమ్ పోలీసులు బెయిల్ ఇవ్వకూడదని మంగళవారం కౌంటర్ దాఖలు చేయనున్నారు.

చిత్ర పరిశ్రమకు పైరసీ ద్వారా భారీ నష్టం చేకూర్చారనే ఆరోపణలపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. సైబర్ క్రైమ్ పోలీసులు అతడిపై నాలుగు కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. కేసు తీవ్రత దృష్ట్యా నాంపల్లి కోర్టు పలుమార్లు రవి బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది.


More Telugu News