జోర్డాన్ వెళుతున్న జూనియర్ ఎన్టీఆర్.. నెక్స్ట్ షెడ్యూల్ షూటింగ్ అక్కడే!
- తారక్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం
- ఫిబ్రవరి 5 నుంచి జోర్డాన్ లో షూటింగ్
- ముందుగానే జోర్డాన్ కు వెళుతున్న జూనియర్ ఎన్టీఆర్
యంగ్ టైగర్ ఎన్టీఆర్, సంచలన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన తాజా అప్డేట్ బయటకు వచ్చింది. సినిమా నెక్స్ట్ షెడ్యూల్ ఫిబ్రవరి 5 నుంచి జోర్డాన్ జరగబోతోందని తెలుస్తోంది. హైవోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలను ఈ షెడ్యూల్ లో చిత్రీకరించబోతున్నారు. ఈ కీలక షెడ్యూల్ షూటింగ్ కు సంబంధించి అన్ని ఏర్పాట్లను చిత్ర యూనిట్ పూర్తి చేసింది.
అయితే, షూటింగ్ ప్రారంభానికి రెండు, మూడు రోజుల ముందే జూనియర్ ఎన్టీఆర్ జోర్డాన్ కు వెళుతున్నట్టు సమాచారం. ముందే వెళితే అక్కడి వాతావరణానికి అలవాటు పడవచ్చనేది తారక్ ఆలోచనగా తెలుస్తోంది. మరోవైపు ఈ సినిమాపై ఇప్పటికే పాన్ ఇండియా లెవెల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.