కర్నూలు ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో భారీ అగ్ని ప్రమాదం .. ఒకరికి తీవ్ర గాయాలు

  • కోటయ్య సిల్వర్ సామాగ్రి తయారు చేసే ఫ్యాక్టరీలో ఆయిల్ ట్యాంక్ పేలడంతో ప్రమాదం
  • ఘటనలో ఫ్యాక్టరీలోని పలు వస్తువులతో పాటు ఓ వాహనం దగ్ధమైన వైనం 
  • మంటలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది
కర్నూలులోని కల్లూరు ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో నిన్న భారీ అగ్నిప్రమాదం జరిగింది. కోటయ్య సిల్వర్ సామాగ్రి తయారు చేసే ఫ్యాక్టరీలో ప్రమాదవశాత్తు ఆయిల్ ట్యాంక్ పేలడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఫ్యాక్టరీలోని పలు వస్తువులతో పాటు ఓ వాహనం మంటల్లో దగ్ధమైంది.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. 


More Telugu News