Jan Nayagan: ‘జన నాయగన్‌’లో వివాదాస్పద సీన్లు..వాటికే కోర్టు అభ్యంతరం

Jan Nayagan Controversial Scenes Court Objections
  • సింగిల్ జడ్జి ఉత్తర్వులను రద్దు చేసిన మద్రాసు హైకోర్టు ధర్మాసనం 
  • దేశంలో మత కల్లోలాలు సీన్లు ఉన్నాయన్న హైకోర్టు 
  • సినిమాను భద్రతా కమిటీ పరిశీలించాల్సిందేనని స్పష్టీకరణ 
  • గతంలో ఇచ్చిన 'యూ/ఏ' సర్టిఫికెట్ ఉత్తర్వులు కొట్టివేత 
  • మళ్లీ పిటిషన్ దాఖలు చేసుకునేందుకు వెసులుబాటు
తమిళ చిత్రం ‘జన నాయగన్‌’ సెన్సార్ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమాలో విదేశీ శక్తుల ప్రోద్బలంతో దేశంలో మత విద్వేషాలు రగిలించేలా ఉన్న దృశ్యాలపై మద్రాసు హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.ఎం.శ్రీవాస్తవ, జస్టిస్‌ అరుళ్‌మురుగన్‌లతో కూడిన ధర్మాసనం సంచలన తీర్పునిచ్చింది.

గతంలో ఈ సినిమాను పరిశీలించిన సింగిల్ జడ్జి, దీనికి 'యూ/ఏ' సర్టిఫికెట్ ఇవ్వాలని ఆదేశించారు. అయితే, సెన్సార్ బోర్డు ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ అప్పీల్‌కు వెళ్ళింది. బోర్డు వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం.. సెన్సార్ బోర్డు ఛైర్మన్‌కు తన వివరణ ఇచ్చుకునేందుకు సింగిల్ జడ్జి తగిన సమయం ఇవ్వలేదని పేర్కొంది.

కోర్టు అభ్యంతరాలు ఇవే
  • దేశంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా, మత కల్లోలాలను ప్రేరేపించేలా ఉన్న సీన్లపై బోర్డు సభ్యులు ఫిర్యాదు చేశారు.
  • సినిమాలో భద్రతా దళాలకు సంబంధించిన సున్నితమైన అంశాలు ఉన్నాయి. మొదటి కమిటీలో వీటికి సంబంధించిన నిపుణులు లేనందున, దీనిని రివైజింగ్ కమిటీకి పంపడమే సరైన నిర్ణయమని కోర్టు అభిప్రాయపడింది.
  • సినిమాకు 'యూ/ఏ 16+' రేటింగ్ ఇచ్చేందుకు గల కారణాలను లేదా ఆధారాలను నిర్మాణ సంస్థ కోర్టుకు సమర్పించలేకపోయింది.

ప్రస్తుతానికి సింగిల్ జడ్జి ఉత్తర్వులను రద్దు చేసిన కోర్టు, సినిమా బృందానికి ఒక చిన్న ఊరటనిచ్చింది. వారు కావాలనుకుంటే కొత్తగా పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని, పూర్తి విచారణ తర్వాత దీనిని రివైజింగ్ కమిటీకి పంపాలా, వద్దా అనే అంశంపై సింగిల్ జడ్జి తుది నిర్ణయం తీసుకోవచ్చని తీర్పులో పేర్కొంది. 
Jan Nayagan
Jan Nayagan movie
Madras High Court
religious disharmony
court objections
censor board
U/A certificate
movie controversy
peace and security
revising committee

More Telugu News