అజిత్ పవార్ మృతికి ఏపీ కేబినెట్ సంతాపం
- భేటీ ప్రారంభంలో పవార్ మరణాన్ని ప్రస్తావించిన సీఎం చంద్రబాబు
- సంతాపం తెలిపిన మంత్రిమండలి
- కేబినెట్ లో సంతాప తీర్మానం
ప్రమాద విషయం తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యానని చంద్రబాబు చెప్పారు. అజిత్ పవార్ తో తనకున్న పరిచయాన్ని సీఎం గుర్తుచేసుకున్నారు. అజిత్ పవార్ మృతి మహారాష్ట్ర రాజకీయాల్లో తీరని లోటని చంద్రబాబు అన్నారు. అజిత్ పవార్ మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ మంత్రులు మౌనం పాటించారు.