చుక్కలనంటిన పసిడి, వెండి.. రికార్డు స్థాయిలో పెరిగిన ధరలు

  • నిరాటంకంగా కొనసాగుతున్న బంగారం, వెండి ధరల పెరుగుదల
  • భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో సురక్షిత పెట్టుబడుల వైపు ఇన్వెస్టర్ల మొగ్గు
  • హైదరాబాద్‌లో రూ.1.65 లక్షలు దాటిన 24 క్యారెట్ల తులం బంగారం ధర 
  • వెండి ధర కూడా జోరు.. కిలోకు రూ.10,000 పెరిగి రూ.4 లక్షలకు చేరిక
బంగారం, వెండి ధరల పరుగు ఆగడం లేదు. అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక, రాజకీయ అనిశ్చితుల కారణంగా పెట్టుబడిదారులు సురక్షితమైన ఆస్తుల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో పసిడి, వెండికి డిమాండ్ పెరిగి ధరలు రికార్డు స్థాయికి దూసుకెళ్తున్నాయి. తాజాగా బంగారం ధర పది గ్రాములకు రూ.3,220 మేర పెరిగింది. వెండి సైతం కిలోకు ఏకంగా సుమారు రూ.10,000 పెరగడం గమనార్హం.

ఈరోజు ఉదయం 11:00 గంటల సమయానికి హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,65,170కి చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,950 పెరిగి రూ.1,51,400 వద్ద కొన‌సాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలోనూ ఇదే పరిస్థితి ఉంది. అక్కడ 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,65,300 ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,51,550గా నమోదైంది.

వెండిది కూడా అదే జోరు
మరోవైపు బంగారం బాటలోనే వెండి కూడా పరుగులు పెడుతోంది. నిన్నటితో పోల్చితే కిలో వెండిపై రూ.10,000 పెరిగి, హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.4,00,000కి చేరింది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.3.8 లక్షలుగా ఉంది. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.


More Telugu News