జంషెడ్‌‍పూర్ పారిశ్రామికవేత్త కుమారుడి కిడ్నాప్.. రెండు వారాల తర్వాత కాపాడిన పోలీసులు

  • టాటానగర్‌కు చెందిన వ్యాపారవేత్త కుమారుడి కిడ్నాప్
  • రూ.5 కోట్లు డిమాండ్ చేసిన కిడ్నాపర్లు
  • పోలీసులు వెతుకుతున్నారని భయపడి కైరవ్‌ను వదిలి పారిపోయిన కిడ్నాపర్లు
రెండు వారాల క్రితం కిడ్నాప్‌నకు గురైన జంషెడ్‌పూర్ వ్యాపారవేత్త దేవాంగ్ గాంధీ కుమారుడు, 24 సంవత్సరాల కైరవ్ గాంధీని కిడ్నాపర్ల చెర నుంచి పోలీసులు రక్షించారు. ఈ రోజు వేకువజామున నాలుగున్నర గంటలకు కైరవ్‌ను అతని ఇంటికి చేర్చారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, టాటానగర్‌లోని ఆదిత్యపూర్ చిన్న పరిశ్రమల సంఘం ఉపాధ్యక్షుడు దేవాంగ్ గాంధీ కుమారుడు కైరవ్‌ ఈ నెల 13న కారులో వెళుతుండగా దుండగులు వెంబడించి కిడ్నాప్ చేశారు. విదేశీ ఫోన్ నెంబర్‌తో అతడి తండ్రికి వాట్సాప్‌లో సందేశాలు పంపించారు. కైరవ్‌ను విడదల చేయాలంటే రూ.5 కోట్లు ఇవ్వాలని బ్లాక్‌మెయిల్ చేశారు.

దేవాంగ్ ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. కైరవ్ కోసం ఏడు బృందాలుగా ఝార్ఖండ్, బీహార్, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. భయపడిన కిడ్నాపర్లు కైరవ్‌ను హజారీబాగ్‌లో వదిలి పారిపోయారు. కైరవ్ ఆచూకీని గుర్తించిన పోలీసులు అతడిని కుటుంబ సభ్యులకు అప్పగించారు.


More Telugu News