Pawan Kalyan: కోట్ల రూపాయల యాడ్ ను తిరస్కరించిన పవన్ కల్యాణ్

Pawan Kalyan Turns Down 40 Crore Tobacco Brand Endorsement
  • పవన్ ను బ్రాండ్ అంబాసడర్ గా తీసుకోవాలనుకున్న టొబాకో కంపెనీ
  • రూ. 40 కోట్ల ఆఫర్ ఇచ్చిన కంపెనీ
  • ఆఫర్ ను తిరస్కరించిన పవన్ కల్యాణ్

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ అంటే... లక్షలాది మంది యువతకు మోటివేషన్, ఆదర్శప్రాయమైన వ్యక్తి. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా భారీ ఫాలోయింగ్ ఉన్న ఆయన, తన నిర్ణయాల్లో ఎప్పుడూ జాగ్రత్తగా ఉంటారు. తన ఆలోచనలకు, నమ్మే సిద్ధాంతాలకు అనుగుణంగానే తాజాగా ఆయన రూ.40 కోట్ల టొబాకో బ్రాండ్ యాడ్ ఆఫర్‌ను సింపుల్‌గా తిరస్కరించి అందరినీ మెప్పించారు.


వివరాల్లోకి వెళితే, ఒక ప్రముఖ టొబాకో కంపెనీ పవన్ కల్యాణ్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా తీసుకోవాలని భావించి, ఆయనకు భారీ ఆఫర్ ఇచ్చింది. రూ.40 కోట్లు ఇవ్వడానికి సిద్ధపడింది. కానీ పవన్ కల్యాణ్ ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా "నో" చెప్పేశారు. ఆయనకు టొబాకో, సిగరెట్ వంటి హానికర ఉత్పత్తుల యాడ్‌లు చేయడం అసలు ఇష్టం లేదు. ఎందుకంటే ఆయన యువత ఆరోగ్యం, శ్రేయస్సు గురించి ఎప్పుడూ స్పృహతో ఉంటారు. ఈ నిర్ణయం తర్వాత సోషల్ మీడియాలో "మా హీరో కోట్లు ఇచ్చినా తప్పు చేయడు" అనే కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. పవన్ కల్యాణ్ ఇప్పటికే ఆరోగ్యం, యోగా, ఫిట్‌నెస్‌పై అవగాహన కల్పించే కార్యక్రమాల్లో భాగస్వామి అవుతున్నారు.

Pawan Kalyan
Pawan Kalyan brand ambassador
Pawan Kalyan tobacco ad
Pawan Kalyan rejects offer
Tollywood news
Pawan Kalyan motivation
Tobacco brand ad offer
celebrity endorsements
health awareness
Pawan Kalyan fitness

More Telugu News