Krishnamachari Srikkanth: టీ20 ప్రపంచ కప్ కోసం పాకిస్థాన్ రాకపోవడమే మంచిది... వస్తే మన వాళ్లు చుక్కలు చూపిస్తారు: మాజీ క్రికెటర్

Krishnamachari Srikkanth Says Pakistan Should Avoid T20 World Cup
  • పాక్ పాల్గొంటే టీమిండియా వారికి చుక్కలు చూపిస్తుందని సరదా వ్యాఖ్య
  • చాలా జట్లు 'మేం రాము కానీ ప్రపంచ కప్ మీరే ఉంచుకోండి' అంటాయేమోనని వ్యాఖ్య
  • పాక్ పాల్గొంటే భారత బ్యాటర్లు చుక్కలు చూపిస్తారని వ్యాఖ్య
ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న టీ20 ప్రపంచ కప్ కోసం పాకిస్థాన్ రాకపోవడమే మంచిదని, ఒకవేళ పాక్ పాల్గొంటే భారత జట్టు వారికి చుక్కలు చూపిస్తుందని భారత మాజీ ఆటగాడు కృష్ణమాచారి శ్రీకాంత్ సరదాగా వ్యాఖ్యానించాడు. టీ20 ప్రపంచ కప్‌లో పాకిస్థాన్ పాల్గొనడంపై సందిగ్ధత నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీకాంత్ మాట్లాడుతూ, పాకిస్థాన్ ప్రపంచ కప్ ఆడటానికి రాకపోవడమే మేలని అభిప్రాయపడ్డాడు.

న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో భారత్ 15.2 ఓవర్లలోనే 209 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిందని, మూడో మ్యాచ్‌లో భారత జట్టు 10 ఓవర్లలోనే 154 పరుగుల లక్ష్యాన్ని పూర్తి చేసిందని గుర్తు చేశాడు. దీనిని చూసి చాలా జట్లు తాము రావడం లేదని, ప్రపంచ కప్‌ను మీరే ఉంచుకోండని అంటాయేమోనని చమత్కరించాడు. పీసీబీ ఛైర్మన్ నఖ్వీ దీని గురించి మాట్లాడుతున్నాడని, కానీ వారు పాల్గొంటే భారత బ్యాటర్లు వారికి చుక్కలు చూపిస్తారని పేర్కొన్నాడు.

భారత ఆటగాళ్లు కొలంబోలో సిక్స్‌లు కొడితే ఆ బంతి చెన్నైలో పడుతుందని, కాబట్టి జాగ్రత్తగా ఉండాలని సరదాగా హెచ్చరించాడు. భారత జట్టు అద్భుతమైన ఆటతీరుతో ప్రతి జట్టుకు గట్టి హెచ్చరిక పంపిందని అన్నాడు. టీ20 క్రికెట్‌లో ఇటువంటి హిట్టింగ్‌ను తాను ఎప్పుడూ చూడలేదని శ్రీకాంత్ పేర్కొన్నాడు.
Krishnamachari Srikkanth
T20 World Cup
Pakistan
Suryakumar Yadav
India Cricket
PCB
Cricket News

More Telugu News