Nara Lokesh: ఆప్యాయంగా మాట్లాడుకున్న నారా లోకేశ్, బొత్స సత్యనారాయణ

Nara Lokesh Botsa Satyanarayana Engage in Friendly Conversation
  • 'ఎట్ హోం' కార్యక్రమాన్ని నిర్వహించిన గవర్నర్ అబ్దుల్ నజీర్
  • హాజరైన సీఎం, డిప్యూటీ సీఎం, పలువురు నేతలు
  • లోకేశ్, బొత్స మధ్య సరదా సంభాషణ

గణతంత్ర దినోత్సవం సందర్భంగా విజయవాడలోని లోక్ భవన్ లో గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ 'ఎట్ హోం' కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌తో పాటు కూటమి ప్రభుత్వ నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వైసీపీ నేత బొత్స సత్యనారాయణ కూడా హాజరయ్యారు. 


ఈ సందర్భంగా ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. నారా లోకేశ్, బొత్స సత్యనారాయణ మధ్య సరదా సంభాషణ జరిగింది. రాజకీయాలకు అతీతంగా ఇద్దరూ ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. ఆ సమయంలో అక్కడ ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సహా పలువురు నేతలు ఉన్నారు. 

Nara Lokesh
Botsa Satyanarayana
Andhra Pradesh
AP Politics
Republic Day
Vijayawada
Lok Bhavan
Chandrababu Naidu
Pawan Kalyan
Yarlagadda Venkatrao

More Telugu News