Chandrababu Naidu: అమరావతిలో మొదటిసారిగా రిపబ్లిక్ డే వేడుకలు... సీఎం చంద్రబాబు స్పందన

Chandrababu Naidu Reacts to First Republic Day Celebrations in Amaravati
  • అమరావతిలో తొలిసారి గణతంత్ర వేడుకలు జరగడంపై సీఎం చంద్రబాబు హర్షం
  • ఈ రిపబ్లిక్ డే ఏపీ ప్రజలకు చిరస్మరణీయమని వ్యాఖ్య
  • ప్రభుత్వ ఎజెండాను వివరించిన గవర్నర్‌కు కృతజ్ఞతలు తెలిపిన సీఎం
  • పరేడ్, శకటాల ప్రదర్శన భవిష్యత్ ఆకాంక్షలకు అద్దం పట్టాయన్న చంద్రబాబు
ప్రజా రాజధాని అమరావతిలో తొలిసారిగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించడం ఒక చారిత్రాత్మక ఘట్టమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఈ ఏడాది రిపబ్లిక్ డే రాష్ట్ర ప్రజలకు ఎంతో గర్వకారణమని, చిరకాలం గుర్తుండిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ చారిత్రక సందర్భంపై చంద్రబాబు సోమవారం స్పందిస్తూ.. అమరావతిలో మువ్వన్నెల జెండాను ఎగురవేయడం ఆనందంగా ఉందన్నారు. వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వ ఎజెండాను, భవిష్యత్ కార్యాచరణను గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ స్పష్టంగా వివరించారని, ఇందుకు ఆయనకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నానని ట్వీట్ చేశారు.

గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన గ్రాండ్ పరేడ్, అందంగా తీర్చిదిద్దిన శకటాల ప్రదర్శన మన సమష్టి ఆశయాలకు, భవిష్యత్ దృష్టికి అద్దం పట్టాయని చంద్రబాబు ప్రశంసించారు. ఈ వేడుకలను వీక్షించడం ఎంతో సంతోషాన్నిచ్చిందని పేర్కొంటూ ‘జై హింద్’ అని తన ప్రకటనను ముగించారు.
Chandrababu Naidu
Amaravati
Republic Day
Andhra Pradesh
AP CM
Abdul Nazeer
Republic Day Celebrations
AP Government

More Telugu News