రెండోసారి తల్లి కాబోతున్న టాలీవుడ్ బ్యూటీ పూర్ణ
- దుబాయ్ బిజినెస్‌మ్యాన్ ను పెళ్లాడిన పూర్ణ
- ఇప్పటికే ఈ దంపతులకు ఒక కుమారుడు
- బేబీ బంప్‌తో ఉన్న ఫొటోను షేర్ చేసిన పూర్ణ
టాలీవుడ్‌లో ఒకప్పుడు హీరోయిన్‌గా మెరిసిన పూర్ణ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీగా ఉంది. పలు సినిమాల్లో కథానాయికగా ప్రేక్షకులను మెప్పించిన పూర్ణ... ఇప్పుడు సపోర్టింగ్ రోల్స్‌తో పాటు టీవీ షోలు, డ్యాన్స్ ప్రోగ్రామ్స్‌లో కూడా సందడి చేస్తోంది. తాజాగా బాలకృష్ణ నటించిన 'అఖండ 2: తాండవం'లో కీలక పాత్రలో మెరిసి అందరి మనసు గెలిచింది.
వ్యక్తిగత జీవితంలో కూడా పూర్ణ ఎంతో సంతోషంగా ఉంది. మూడేళ్ల క్రితం (2022లో) దుబాయ్ బిజినెస్‌మ్యాన్ షనిద్ ఆసిఫ్ అలీని పూర్ణ రహస్యంగా పెళ్లి చేసుకుంది. ఈ దంపతులకు ఒక కుమారుడు హమ్దాన్ ఆసిఫ్ అలీ ఉన్నాడు. ఇప్పుడు మరో శుభవార్త ఏమిటంటే... పూర్ణ రెండోసారి తల్లి అవుతోంది. ఈ క్రమంలో తాజాగా, బేబీ బంప్‌తో తీసుకున్న అద్భుతమైన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పూర్ణ షేర్ చేసింది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.