Jobs: ఆర్బీఐలో ఉద్యోగాలు.. పదో తరగతి పాసైతే చాలు, అంతకుమించితే అనర్హతే..!

RBI Attendant Jobs 10th Pass Eligible Higher Qualification Ineligible
  • అటెండెంట్ ఉద్యోగాలకు ప్రకటన జారీ చేసిన ఆర్బీఐ
  • మొత్తం 572 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
  • ఆన్ లైన్ లో దరఖాస్తు.. ఫిబ్రవరి 24 గడువు
పదో తరగతి పాసైన వారికి ప్రభుత్వ ఉద్యోగం పొందే అవకాశం.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తాజాగా అటెండెంట్ పోస్టుల భర్తీకి ప్రకటన జారీ చేసింది. మొత్తం 572 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు పదో తరగతిని అర్హతగా నిర్ణయించింది. పదో తరగతి పాసైన వారు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. కాగా, దేశంలో నిరుద్యోగం తీవ్రస్థాయిలో ఉండడంతో ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ ఎక్కువగా ఉంటుందనే విషయం తెలిసిందే.

పదో తరగతి కనీస అర్హత కలిగిన ఉద్యోగాలకూ పీజీ, పీహెచ్ డీ చేసిన అభ్యర్థులు పోటీపడుతుంటారు. దీంతో పదోతరగతితో చదువు ఆపేసిన వారికి ఆ ఉద్యోగం దొరికే అవకాశాలు తగ్గిపోతాయి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆర్బీఐ తాజా నోటిఫికేషన్ లో కీలకమైన షరతు విధించింది. అటెండెంట్ ఉద్యోగానికి పదో తరగతి పాస్ అయిన అభ్యర్థులు సరిపోతారని వివరిస్తూ.. ఉన్నత విద్యావంతులను ఈ పోస్టులకు అనర్హులుగా ప్రకటించింది. ఉన్నత విద్యార్హతలు ఈ పోస్టులకు అనర్హతగా పరిగణిస్తామని వెల్లడించింది.

వయస్సు: 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలు (రిజర్వేషన్ల ప్రకారం మినహాయింపులు)
భాషా సామర్థ్యం: అభ్యర్థి దరఖాస్తు చేసుకునే రాష్ట్రం, రీజియన్ లకు చెందిన భాషలో స్పష్టంగా మాట్లాడగలగాలి. రాయడం, చదవడం వచ్చి ఉండాలి.
దరఖాస్తు రుసుము: ఆన్ లైన్ లో ఫిబ్రవరి 24 లోగా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు రుసుముగా ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మాజీ సైనికులు రూ.50 (జీఎస్టీ అదనం) చెల్లించాలి. ఇతరులు రూ.450 (జీఎస్టీ అదనం) ఆన్ లైన్ లో చెల్లించాలి.
Jobs
Govt Jobs
RBI
Job Notification
Reserve Bank of India
RBI Attendant Jobs
Tenth Class Jobs
Government Jobs
Bank Jobs
Employment News
Latest Jobs
Recruitment

More Telugu News