Ferry Accident: ఫిలిప్పీన్స్ లో ఘోరం.. నీట మునిగిన ఫెర్రీ.. 100 మందికి పైగా గల్లంతు

Philippines Ferry Disaster Over 100 Missing at Sea
  • ఆదివారం అర్ధరాత్రి ప్రమాదం
  • 215 మందిని కాపాడిన కోస్ట్ గార్డ్ సిబ్బంది
  • ఏడు మృతదేహాల వెలికితీత
  • కొనసాగుతున్న సహాయక చర్యలు
ఫిలిప్పీన్స్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం అర్ధరాత్రి సమయంలో 359 మందితో వెళుతున్న ఓ ఫెర్రీ ప్రమాదవశాత్తూ నీట మునిగింది. వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది 215 మందిని కాపాడి ఒడ్డుకు చేర్చారు. వంద మందికి పైగా సముద్రంలో గల్లంతయ్యారు. సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. వివరాల్లోకి వెళితే..

ఆదివారం అర్ధరాత్రి సమయంలో ఎంవీ త్రిషా కెరిస్టెన్ 3 అనే నౌక జాంబోంగా సిటీ నుంచి జోలో దీవికి బయలుదేరింది. నౌకలో 332 మంది ప్రయాణికులు, 27 మంది సిబ్బంది ఉన్నారు. ఈ క్రమంలో బసిలన్ ప్రావిన్స్ సమీపంలో సాంకేతిక సమస్య కారణంగా నౌక మునిగిపోయింది. విషయం తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన కోస్ట్ గార్డ్, నేవీ సిబ్బందికి తోడు జాలర్లు సహాయక చర్యలు చేపట్టారు. నీట మునిగిన ప్రయాణికులను కాపాడి ఒడ్డుకు చేర్చారు. సోమవారం ఉదయం కూడా సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మరో 100 మందికి పైగా నీటిలో గల్లంతయ్యారని, వారి కోసం గాలిస్తున్నామని చెప్పారు.
Ferry Accident
Philippines
Ferry Accident
MV Trisha Keristen 3
Zamboanga City
Jolo Island
Basilan Province
Ship Accident
Ferry Sinking

More Telugu News