పరీక్షల టెన్షన్.. తట్టుకోలేక గోవాకు జంప్!
- పరీక్షల ఒత్తిడి భరించలేక ఇంట్లో ఉన్న రూ. 3 లక్షలతో పరారైన 17 ఏళ్ల విద్యార్థి
- గుజరాత్ నుంచి గోవా వరకు గాలించి బాలుడిని పట్టుకున్న పోలీసులు
- చదువు నుంచి బ్రేక్ కావాలనే ఇలా చేశానన్న బాలుడు
- బాలుడిని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు
చదువుల ఒత్తిడి పిల్లలను ఏ స్థాయికి తీసుకువెళ్తుందో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. గుజరాత్‌లోని వడోదరకు చెందిన ఒక 17 ఏళ్ల ఇంటర్ విద్యార్థి పరీక్షల భయం తట్టుకోలేక ఏకంగా గోవాకు చెక్కేసి పోలీసులకు చుక్కలు చూపించాడు. ఇంట్లో దాచిన రూ. 3 లక్షల నగదును తీసుకుని సైలెంట్‌గా మాయమయ్యాడు. ఆ డబ్బు మరెవరిదో కాదు.. తన అక్క యూపీఎస్సీ కోచింగ్ కోసం కష్టపడి కూడబెట్టిన ఫీజు డబ్బులు.
పరీక్షల తేదీలు దగ్గర పడుతుండటంతో ఆ బాలుడు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యాడు. ఎలాగైనా ఈ చదువుల నుంచి దూరంగా పారిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఇంట్లో వాళ్లంతా నిద్రపోతున్న సమయంలో నగదు తీసుకుని నేరుగా రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాడు. అక్కడి నుంచి ముంబై మీదుగా గోవాకు వెళ్ళిపోయాడు. కొడుకు కనిపించకపోయేసరికి కంగారుపడిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వడోదర పోలీసులు బాలుడి ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా గాలింపు చేపట్టారు. చివరికి గోవాలోని ఒక బీచ్ రిసార్ట్‌లో విలాసవంతంగా గడుపుతున్న బాలుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. "చదువుకోవాలని అందరూ ఒత్తిడి చేస్తున్నారు, నాకు కాస్త ప్రశాంతత కావాలి.. అందుకే గోవా వచ్చేశా" అని ఆ కుర్రాడు చెప్పిన సమాధానం విని పోలీసులు సైతం అవాక్కయ్యారు.
బాలుడిని క్షేమంగా వడోదరకు తీసుకువచ్చిన పోలీసులు అతడికి ప్రొఫెషనల్ కౌన్సెలింగ్ ఇప్పిస్తున్నారు. పిల్లలపై చదువుల పేరుతో అతిగా ఒత్తిడి తీసుకురావద్దని ఈ సందర్భంగా పోలీసులు తల్లిదండ్రులకు సూచించారు. అదృష్టవశాత్తూ అక్క ఫీజు డబ్బుల్లో కొంత మొత్తం ఇంకా మిగిలే ఉండటంతో ఆ కుటుంబం ఊపిరి పీల్చుకుంది.