Operation Sindoor: పాక్‌ను వణికించిన ‘ఆపరేషన్ సిందూర్’.. స్విస్ అధ్యయనంలో సంచలన నిజాలు!

Operation Sindoor shook Pakistan Swiss study reveals sensational truths
  • ఆపరేషన్ సిందూర్ వేళ పాకిస్థాన్‌పై పూర్తి స్థాయి ఆధిపత్యాన్ని ప్రదర్శించిన ఐఏఎఫ్
  • నాలుగు రోజుల్లోనే పాకిస్థాన్ మోకరిల్లేలా చేసిన వైనం
  • బ్రహ్మోస్ క్షిపణుల ముందు పాక్ రక్షణ వ్యవస్థలు నిర్వీర్యం
  • సీహెచ్‌పీఎం తాజా నివేదికలో వెల్లడి
2025 మే నెలలో భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన ‘ఆపరేషన్ సిందూర్’ ఒక చారిత్రక మలుపు అని స్విట్జర్లాండ్‌కు చెందిన 'సెంటర్ ఫర్ మిలిటరీ హిస్టరీ అండ్ పెర్స్పెక్టివ్ స్టడీస్' (సీహెచ్‌పీఎం) తన తాజా నివేదికలో పేర్కొంది. ఈ యుద్ధంలో భారత వైమానిక దళం ధాటికి పాకిస్థాన్ విలవిలలాడిందని, చివరకు తట్టుకోలేక కాల్పుల విరమణ కోసం ప్రాధేయపడిందని ఈ అధ్యయనం స్పష్టం చేసింది.

పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఈ ఆపరేషన్ 88 గంటల పాటు సాగింది. ఈ స్వల్ప కాలంలోనే భారత యుద్ధ విమానాలు పాక్ గగనతలంలోకి చొచ్చుకువెళ్లి ఉగ్రవాద శిబిరాలతో పాటు, ఆ దేశ సైనిక స్థావరాలను ధ్వంసం చేశాయి. స్విస్ నివేదిక ప్రకారం.. భారత్ అనుసరించిన 'ఎస్కలేషన్ డామినెన్స్' (యుద్ధాన్ని తన అదుపులో ఉంచుకునే వ్యూహం) ముందు పాకిస్థాన్ నిలవలేకపోయింది. మే 10వ తేదీ ఉదయానికల్లా పాక్ సైన్యం తన పరాజయాన్ని అంగీకరిస్తూ యుద్ధాన్ని ఆపేయాలని కోరినట్లు నివేదిక వెల్లడించింది.

భారత రక్షణ వ్యవస్థలో భాగమైన ఎస్-400 క్షిపణులు పాక్ డ్రోన్లు, విమానాలను సమర్థవంతంగా అడ్డుకున్నాయని ఈ అధ్యయనం ప్రశంసించింది. మరోవైపు, భారత గగనతలం నుంచే ప్రయోగించిన బ్రహ్మోస్, స్కాల్ప్ క్షిపణులు పాక్ భూభాగంలోని 200 కిలోమీటర్ల లోపల ఉన్న లక్ష్యాలను ఛేదించాయి. దీనివల్ల పాక్ తన రాడార్లు, కమాండ్ సెంటర్లను కోల్పోయి 'గుడ్డిది'గా మారిందని, యుద్ధం కొనసాగించే శక్తి లేకనే సంధికి ఒప్పుకుందని విశ్లేషించింది.

ఈ స్విస్ నివేదిక ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా రక్షణ రంగ నిపుణులను ఆకర్షిస్తోంది. అణ్వస్త్రాలు ఉన్న రెండు దేశాల మధ్య యుద్ధం జరిగినా, అణు యుద్ధం వరకు వెళ్లకుండానే శత్రువును ఎలా లొంగదీసుకోవచ్చో భారత్ నిరూపించిందని ఈ నివేదిక కొనియాడింది. ఈ నివేదిక వెలువడిన తర్వాత పాకిస్థాన్ నుంచి ఎటువంటి అధికారిక స్పందన రాకపోవడం గమనార్హం. 
Operation Sindoor
India Pakistan war
Indian Air Force
S 400 missiles
Brahmos missile
Scalp missile
Center for Military History and Perspective Studies
CHPM
Escalation Dominance
Pahalgam terror attack

More Telugu News