Yuzvendra Chahal: ఆర్జే మహ్వాష్‌కు చాహల్ షాక్.. కొత్త బ్యూటీతో కెమెరాకు చిక్కిన స్పిన్నర్!

Yuzvendra Chahal Spotted With New Celebrity After RJ Mahvash Unfollow
  • ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్న చాహల్, ఆర్జే మహ్వాష్
  • ఊపందుకున్న బ్రేకప్ వార్తలు 
  • ముంబైలో బిగ్ బాస్-13 ఫేమ్ షెఫాలీ బగ్గాతో కలిసి కెమెరాకు చిక్కిన చాహల్
  • 2025 మార్చిలో ధనశ్రీ వర్మతో అధికారికంగా విడాకులు తీసుకున్న టీమిండియా స్టార్ స్పిన్నర్ 
  • "అందరికీ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు" అంటూ చాహల్ పోస్ట్
క్రికెట్ మైదానంలో గూగ్లీలతో ప్రత్యర్థులను బోల్తా కొట్టించే యుజ్వేంద్ర చాహల్ నిజ జీవితంలో మాత్రం వరుస 'ట్విస్టుల'తో నెటిజన్లను ఆశ్చర్యపరుస్తున్నాడు. తన వ్యక్తిగత జీవితంపై రోజుకో పుకారు షికారు చేస్తున్న తరుణంలో తాజాగా ఆయన మరో సెలబ్రిటీతో కనిపించడం చర్చనీయాంశమైంది.

కొంతకాలంగా చాహల్ పేరు ఆర్జే మహ్వాష్‌తో బలంగా వినిపించింది. ధనశ్రీతో విడాకుల తర్వాత వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరగడం, గ్రౌండ్‌లో చాహల్‌ను ఆమె ఉత్సాహపరచడం చూసి త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కుతారని అందరూ భావించారు. కానీ, సడన్‌గా వీరిద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడం సోషల్ మీడియాలో కలకలం రేపింది. దానికి తోడు "నా జీవితాన్ని చక్కదిద్దుకుంటున్నాను" అని మహ్వాష్, "మౌనంగా ఉండటం తప్పు కాదు" అని చాహల్ పెట్టిన పోస్టులు వీరిద్దరి మధ్య బంధం ముగిసిందని స్పష్టం చేస్తున్నాయి.

ఈ 'అన్‌ఫాలో' డ్రామా నడుస్తుండగానే శనివారం రాత్రి ముంబైలో బిగ్ బాస్ ఫేమ్, స్పోర్ట్స్ యాంకర్ షెఫాలీ బగ్గాతో కలిసి చాహల్ కనిపించడం హాట్ టాపిక్‌గా మారింది. వీరిద్దరూ కలిసి డిన్నర్‌కు వెళ్లిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఫొటోగ్రాఫర్లు కలిసి పోజు ఇవ్వమని అడిగితే చాహల్ సున్నితంగా తిరస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోవడం గమనార్హం.

చాహల్ ప్రస్తుతానికి పంజాబ్ కింగ్స్ తరఫున ఐపీఎల్ 2026 సీజన్ కోసం సిద్ధమవుతున్నాడు. అయితే వరుసగా తన వ్యక్తిగత విషయాలు బయటకు వస్తుండటంపై చాహల్ స్పందిస్తూ.. "ప్రతి ఒక్కరికీ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు, మౌనంగా ఉంటేనే మంచిది" అని ఒక పుస్తకంలోని వాక్యాన్ని షేర్ చేశాడు. అటు మహ్వాష్ కానీ, ఇటు షెఫాలీ కానీ ఈ విషయంలో ఇంకా మౌనం వీడలేదు.
Yuzvendra Chahal
Chahal
RJ Mahvash
Shefali Bagga
Dhanashree Verma
IPL 2026
Punjab Kings
Indian cricketer
cricket news
gossip

More Telugu News