'వాంటెడ్' జాబితాలో ఉన్న వారిలో 70 మంది విదేశాల్లో ఉన్నారు: కేంద్ర ప్రభుత్వం
- పరారీలో ఉన్న వారి గుర్తించే ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతుందన్న కేంద్రం
- ఇతర దేశాలు వెతుకుతున్న 203 మంది నిందితులు భారత్లో ఉన్నట్లు వెల్లడి
- వాంటెడ్ జాబితాలో ఉన్న వారిలో 27 మంది గత ఏడాది తిరిగి వచ్చినట్లు వెల్లడి
వాంటెడ్ జాబితాలో ఉన్న వారిలో 27 మంది గత సంవత్సరం విదేశాల నుంచి తిరిగి వచ్చారని భారత ప్రభుత్వం వెల్లడించింది. సీబీఐ కేసులకు సంబంధించి ఏడాది వ్యవధిలో 74 రొగేటరీ లెటర్స్ పంపించినట్లు తెలిపింది. దర్యాప్తునకు సహకరించాలని విదేశీ న్యాయస్థానాలకు రాసే లేఖను రొగేటరీ లెటర్స్ అంటారు. ఈ లేఖల్లో 54 సీబీఐ, మరో 20 రాష్ట్ర దర్యాప్తు బృందాలు రాసినట్లు పేర్కొంది.