మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ... ఇద్దరు మావోలు అరెస్ట్
- దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ మెంబర్ సాల్మన్, ఆయన భార్య అరెస్ట్
- అచ్చంపేటకు వచ్చిన మావోయిస్టు దంపతులు
- అరెస్ట్ చేసిన నాగర్ కర్నూలు పోలీసులు
ఇప్పటికే వరుస ఎన్ కౌంటర్లు, లొంగుబాట్లతో భారీగా దెబ్బతిన్న మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్, మిలిటరీ ఇన్ స్ట్రక్టర్ మీసాల సాల్మన్ అలియాస్ సంతోశ్ నాగరాజు, డీవీసీఎం అయిన ఆయన భార్యను నాగర్ కర్నూలు పోలీసులు అరెస్ట్ చేశారు. అచ్చంపేటకు వచ్చిన వీరు... మావోయిస్టు ఫ్రంట్ సంస్థల నేతల సాయంతో మావోయిస్టు కార్యకలాపాలను తిరిగి పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు.
వీరితో పాటు మహబూబ్ నగర్, నల్లమల ప్రాంతాల్లో మావోయిస్టులకు సహకరిస్తూ, వారికి ఆశ్రయం కల్పిస్తున్న మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో సివిల్ లిబర్టీస్ కమిటీ జాయింట్ సెక్రటరీ జక్క బాలయ్య, తెలంగాణ ప్రజాఫ్రంట్ కో-కన్వీనర్ ఎడ్ల అంబయ్య, మంశెట్టి యాదయ్య ఉన్నారు. ఎర్టిగా కారులో మన్ననూరు నుంచి అచ్చంపేటకు వెళుతున్న సమయంలో వీరిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు.