భారత్ సంస్కరణల ఎక్స్‌ప్రెస్‌గా ఎదుగుతోంది: ప్రధాని నరేంద్ర మోదీ

  • ప్రపంచంలో అత్యధిక యువత మన దేశంలోనే ఉందన్న ప్రధానమంత్రి
  • యువతకు అవకాశాలు కల్పించడమే తమ ప్రభుత్వ ఉద్దేశమన్న మోదీ
  • వివిధ దేశాలతో వాణిజ్య ఒప్పందాల ద్వారా విదేశాల్లోని భారత యువతకు అవకాశాలు లభిస్తాయని వెల్లడి
భారతదేశం సంస్కరణల ఎక్స్‌ప్రెస్‌గా ఎదుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యధిక యువత కలిగిన దేశం మనదని ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా 45 ప్రదేశాల్లో 18వ రోజ్‌గార్ మేళాను నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధాని మోదీ వర్చువల్‌గా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశం సంస్కరణల దిశగా ముందుకు సాగుతోందని, ఇందుకోసం వివిధ దేశాలతో వాణిజ్య, మొబిలిటీ రంగాల్లో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నామని తెలిపారు.

తద్వారా భారతీయ యువతకు ప్రభుత్వం అనేక అవకాశాలను సృష్టిస్తోందని ఆయన అన్నారు. యువతకు ఉద్యోగం లక్ష్యంగా ప్రారంభమైన రోజ్‌గార్ మేళా కార్యక్రమం ఇప్పుడు ఒక సంస్థగా రూపాంతరం చెందిందని అన్నారు. రోజ్‌గార్ వేదికగా దేశంలోని లక్షలాది మంది ఉద్యోగాలు పొందారని ఆయన వెల్లడించారు.

యువతకు సరైన, సమగ్ర అవకాశాలు కల్పించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. అందుకు తమ ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తోందని చెప్పారు. వివిధ దేశాలతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటున్నామని, దీని ద్వారా దేశ, విదేశాల్లో ఉన్న భారతీయ యువతకు విస్తృత అవకాశాలు లభిస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.


More Telugu News