కేసీఆర్ తీరును ప్రజలు అసహ్యించుకుంటున్నారు: నాయిని రాజేందర్ రెడ్డి

  • కేసీఆర్ అధికారంలోకి రాకముందు, వచ్చాక ఆస్తుల వివరాలు బయట పెట్టాలని డిమాండ్
  • కల్వకుంట్ల కుటుంబం రాష్ట్రాన్ని నిలువునా దోచుకుందని విమర్శ
  • జిల్లాలను రద్దు చేస్తామని అబద్ధపు ప్రచారం జరుగుతోందన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీరును ప్రజలు అసహ్యించుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్ అధికారంలోకి రాకముందు, ఆ తరువాత ఆయన ఆస్తుల వివరాలు బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. అధికారంలో ఉన్నప్పుడు కల్వకుంట్ల కుటుంబం రాష్ట్రాన్ని నిలువునా దోచుకుందని ఆయన ఆరోపించారు.

జిల్లాల రద్దు గురించి ప్రచారం జరుగుతోందని, అయితే ఈ విషయాన్ని ఎవరూ ధృవీకరించలేదని ఆయన తెలిపారు. ప్రజలు తప్పుడు వార్తలను నమ్మి ఆందోళన చెందవద్దని ఆయన సూచించారు. ప్రజలను రెచ్చగొట్టడమే బీఆర్ఎస్ నాయకుల పని అని ఆయన విమర్శించారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ అమలు చేయని విధంగా రెండేళ్లలోనే ఎన్నో హామీలను నెరవేర్చామని ఆయన పేర్కొన్నారు.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్, సన్నబియ్యం పంపిణీ, 60 వేలకు పైగా ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగులకు భరోసా పథకం, రైతు భరోసా వంటి అనేక హామీలను అమలు చేశామని ఆయన వివరించారు. ప్రభుత్వం ఎంత మంచి పని చేసినా విమర్శించడమే బీఆర్ఎస్ నేతలు పనిగా పెట్టుకున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.


More Telugu News