టీ20 ప్రపంచకప్‌కు అఫీషియల్ సాంగ్ కంపోజ్ చేస్తున్న అనిరుధ్

  • ఈ అవకాశంతో తన కల నెరవేరిందని వెల్లడి
  • త్వరలోనే ఈ గీతాన్ని విడుదల చేస్తామన్న‌ అనిరుధ్ 
  • ఫిబ్రవరి 7 నుంచి భారత్, శ్రీలంక వేదికలుగా మెగా టోర్నీ
  • డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగనున్న టీమిండియా
రానున్న టీ20 ప్రపంచకప్‌కు ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ అధికారిక గీతాన్ని స్వరపరచనున్నారు. ఈ మెగా టోర్నీలో భాగం కావడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. క్రికెట్ తనకొక ఆట మాత్రమే కాదని, అదొక ఎమోషన్ అని అనిరుధ్ పేర్కొన్నారు. ప్రపంచకప్‌కు పాటను అందించే అవకాశం రావడం గర్వంగా ఉందని, త్వరలోనే ఈ గీతాన్ని విడుదల చేస్తామని తెలిపారు.

కాగా, ఫిబ్రవరి 7వ తేదీ నుంచి భారత్, శ్రీలంక సంయుక్తంగా ఈ మెగా టోర్నమెంట్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న విష‌యం తెలిసిందే. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న టీమిండియా, స్వదేశంలో ఆడనుండటంతో టైటిల్ ఫేవరెట్‌గా కనిపిస్తోంది. సొంతగడ్డపై మరోసారి కప్ గెలిచి అభిమానులను అలరించాలని సూర్య‌ సేన పట్టుదలగా ఉంది. అనిరుధ్ అందించే స్ఫూర్తిదాయక గీతం టోర్నీకి మరింత ఉత్సాహాన్ని తీసుకురానుంది.


More Telugu News