జమ్మూలో మంచు దుప్పటి.. వీడియో ఇదిగో!

  • మూతపడ్డ రోడ్లు.. రైల్వే సేవలకు అంతరాయం
  • మాతా వైష్ణోదేవీ యాత్రికులకు ఇబ్బందులు
  • ఇళ్లు, రోడ్లను కప్పేసిన మంచు
జమ్మూ కశ్మీర్ ను మంచు దుప్పటి కప్పేసింది. రెండు రోజులుగా కురుస్తున్న భారీ హిమపాతం కారణంగా ఇళ్లు, రోడ్లు మంచులో కూరుకుపోయాయి. ఎటుచూసినా తెల్లటి మంచు మాత్రమే కనిపిస్తోంది. రోడ్లపై మంచు పేరుకుపోవడంతో అధికారులు పలు రోడ్లను మూసేశారు. అడుగుల మేర పేరుకుపోయిన మంచును యంత్రాల సాయంతో తొలగిస్తున్నారు. రైల్వే సేవలకు అంతరాయం కలిగింది. పలు సర్వీసులు రద్దయ్యాయి. గందేర్బల్‌, రాజౌరీలోని ప్రాంతాలు, మాతా వైష్ణో దేవి ఆలయంపై దట్టమైన మంచు కప్పేసింది. కాగా, జమ్మూ కశ్మీర్ లో ఏటా డిసెంబర్ 21 నుంచి జనవరి 30 వరకు.. మొత్తం 40 రోజుల పాటు అత్యంత కఠినమైన చలికాలం. దీనిని చిల్లాన్ కల్లాన్ గా వ్యవహరిస్తుంటారు.





More Telugu News