2047 నాటికి ఎయిర్ పోర్టుల సంఖ్య 350కి పెంపు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

  • భారత విమానయాన సంస్థలు ఇప్పటికే 1,700 కొత్త విమానాల కోసం ఆర్డర్లు ఇచ్చాయన్న మంత్రి రామ్మోహన్ నాయుడు
  • దేశీయ విమానయాన సామర్థ్యం మూడు రెట్లు వృద్ధి చెందుతుందని వెల్లడి
  • మూడో అతిపెద్ద మార్కెట్‌గా అవతరించిందన్న రామ్మోహన్ నాయుడు
2047 నాటికి దేశంలోని విమానాశ్రయాల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 164 నుండి 350కి పెంచడమే లక్ష్యమని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు వెల్లడించారు. దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ఆయన మాట్లాడుతూ, భారత విమానయాన సంస్థలు ఇప్పటికే 1,700 కొత్త విమానాల కోసం ఆర్డర్లు ఇచ్చాయని, వీటి రాకతో దేశీయ విమానయాన సామర్థ్యం మూడు రెట్లు వృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.

ఏటా 10 నుండి 12 శాతం వృద్ధిరేటుతో భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానయాన మార్కెట్‌గా ఎదగడమే కాకుండా, మూడో అతిపెద్ద మార్కెట్‌గా అవతరించిందని ఆయన వివరించారు. దేశీయంగా తయారీ రంగాన్ని ప్రోత్సహించడం, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ను వినియోగించడం ద్వారా గ్లోబల్ సప్లై చైన్‌లో భారత్ కీలక భాగస్వామిగా మారనుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. 


More Telugu News