Pawan Kalyan: కోటప్పకొండ స్వామిని దర్శించుకున్న పవన్ కల్యాణ్

Pawan Kalyan Visits Kotappakonda Temple
  • పవన్ కు స్వాగతం పలికిన అధికారులు, ప్రజాప్రతినిధులు
  • ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన పవన్
  • కోటప్పకొండ-కొత్తపాలెం రోడ్డును ప్రారంభించనున్న డిప్యూటీ సీఎం
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు దైవ భక్తి చాలా ఎక్కువ అనే సంగతి అందరికీ తెలిసిందే. వీలున్నప్పుడల్లా ఆయన దేవాలయాలను దర్శిస్తూనే ఉంటారు. తాజాగా ఆయన కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. హెలికాప్టర్ లో అక్కడకు చేరుకున్న పవన్ కు ఆలయ అధికారులు, ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు. అనంతరం ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆయనకు తీర్థప్రసాదాలను అందించారు. కాసేపట్లో ఆయన కోటప్పకొండ-కొత్తపాలెం రోడ్డును ప్రారంభించనున్నారు.
Pawan Kalyan
Kotappakonda
Trikoteswara Swamy
Andhra Pradesh
Temple visit
AP Deputy CM
Hindu Temple
Kotappakonda Temple
New Road Inauguration

More Telugu News