సస్పెండైన అదనపు కలెక్టర్ ఇంట్లో సోదాలు.. కోట్లాది రూపాయలు అక్రమ ఆస్తులు గుర్తింపు
- గత నెలలో రూ.60 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకీ చిక్కిన వెంకట్ రెడ్డి
- ఖరీదైన విల్లా, లక్షల విలువ చేసే ఓపెన్ ప్లాట్లు, వ్యవసాయ భూమి గుర్తింపు
- రూ.30 లక్షల నగదు, రూ.44.03 లక్షల బ్యాంకు బ్యాలెన్స్ గుర్తింపు
పాఠశాల అనుమతికి సంబంధించి గత ఏడాది డిసెంబర్‌లో రూ.60 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కి పట్టుబడి, సస్పెన్షన్‌కు గురైన హన్మకొండ అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వెంకట్ రెడ్డి నివాసంలో ఏసీబీ అధికారులు ఈరోజు సోదాలు నిర్వహించారు. ఆయన ఇల్లుతో సహా మొత్తం ఏడు చోట్ల సోదాలు నిర్వహించిన అధికారులు భారీగా ఆస్తులను గుర్తించారు. వీటి విలువ సుమారు రూ.7.69 కోట్లు ఉంటుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.
సోదాల్లో సుమారు రూ.4.65 కోట్లు విలువైన విల్లాతో పాటు ఒక ఫ్లాట్‌ను గుర్తించారు. అలాగే, రూ.60 లక్షల విలువ చేసే ఒక దుకాణం, రూ.65 లక్షల విలువైన ఎనిమిది ఓపెన్ ప్లాట్లు, 14.5 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. బహిరంగ మార్కెట్లో వీటి విలువ మరింత ఎక్కువగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇదే కాకుండా, రూ.30 లక్షల నగదు, రూ.44.03 లక్షల బ్యాంకు బ్యాలెన్స్, 297 గ్రాముల బంగారు ఆభరణాలను కూడా గుర్తించారు.