మొదట అభిషేక్ విధ్వంసం... ఆఖర్లో రింకూ మెరుపులు... కివీస్ ముందు భారీ టార్గెట్

  • తొలి టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్... స్కోరు 238/7
  • కేవలం 35 బంతుల్లో 84 పరుగులతో చెలరేగిన అభిషేక్ శర్మ
  • చివర్లో మెరుపులు మెరిపించి అజేయంగా నిలిచిన రింకూ సింగ్ (44*)
  • రాణించిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (32), హార్దిక్ పాండ్యా (25) 
  • న్యూజిలాండ్ ముందు 239 పరుగుల భారీ లక్ష్యం
నాగ్‌పూర్‌లో న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు పరుగుల సునామీ సృష్టించారు. యువ సంచలనం అభిషేక్ శర్మ ఆరంభంలో విధ్వంసం సృష్టిస్తే, స్టార్ ఫినిషర్ రింకూ సింగ్ ఆఖర్లో మెరుపులు మెరిపించాడు. వీరిద్దరి అద్భుత ప్రదర్శనతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 238 పరుగుల భారీ స్కోరు సాధించింది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్లు సంజూ శాంసన్ (10), ఇషాన్ కిషన్ (8) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. దీంతో భారత్ 27 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (32)తో కలిసి అభిషేక్ శర్మ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు.

ముఖ్యంగా అభిషేక్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 35 బంతుల్లో 5 ఫోర్లు, 8 భారీ సిక్సర్లతో 84 పరుగులు చేసి కివీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 99 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. అభిషేక్ ఔటయ్యాక హార్దిక్ పాండ్యా (25), శివమ్ దూబే (9) త్వరగానే పెవిలియన్ చేరారు.

అయితే ఇన్నింగ్స్ చివర్లో రింకూ సింగ్ తనదైన శైలిలో రెచ్చిపోయాడు. కేవలం 20 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 44 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో టీమిండియా స్కోరు 230 మార్కును సులభంగా దాటింది. న్యూజిలాండ్ బౌలర్లలో జాకబ్ డఫీ, కైల్ జేమీసన్ చెరో రెండు వికెట్లు తీశారు. కి


More Telugu News