Indian Entrepreneurs: యువ సంపన్నుల జాబితాలో భారత్ టాప్

Indian Entrepreneurs Top Young Wealthy List Globally
  • యువ సెంటీమిలియనీర్ల జాబితాలో చైనా, యూకేను అధిగమించిన భారత్
  • ఈ జాబితాలో భారత్ నుంచి 201 మంది యువ పారిశ్రామికవేత్తలు
  • 'ఇండియాస్ యూ40 క్యాపిటల్'‌గా నిలిచిన బెంగళూరు నగరం
  • జాబితాలోని 83 శాతం మంది తొలితరం వ్యాపారవేత్తలే!
  • సాఫ్ట్‌వేర్ రంగం నుంచి అత్యధికంగా 40 మందికి చోటు
ప్రపంచవ్యాప్తంగా యువ పారిశ్రామికవేత్తల విషయంలో భారత్ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. 40 ఏళ్లలోపు వయసున్న సెంటీమిలియనీర్ల (వంద మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ సంపద) జాబితాలో చైనా, యూకే వంటి దేశాలను భారత్ అధిగమించింది. అవెండస్ వెల్త్ మేనేజ్‌మెంట్, హురున్ ఇండియా సంయుక్తంగా బుధవారం విడుదల చేసిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. ఈ జాబితాలో మొత్తం 505 మంది యువ వ్యాపారవేత్తలు ఉండగా, వారిలో 201 మంది భారతీయులే కావడం విశేషం.

ఈ నివేదిక ప్రకారం, భారత్ నుంచి 201 మంది, చైనా నుంచి 194 మంది, యూకే నుంచి 110 మంది యువ వ్యాపారవేత్తలు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. దేశంలో అత్యధికంగా బెంగళూరు నుంచి 48 మంది పారిశ్రామికవేత్తలు ఈ జాబితాలో ఉండటంతో, ఆ నగరం 'ఇండియాస్ యూ40 క్యాపిటల్'గా తన స్థానాన్ని పదిలం చేసుకుంది. 36 నుంచి 40 ఏళ్ల వయసు ఉండి, తొలితరం పారిశ్రామికవేత్తలకు కనీసం 100 మిలియన్ డాలర్లు, వారసత్వ వ్యాపారవేత్తలకు 200 మిలియన్ డాలర్ల వ్యాపార విలువ ఉన్న వారిని ఈ జాబితా కోసం పరిగణనలోకి తీసుకున్నారు.

భారత్‌లో పెరుగుతున్న వ్యవస్థాపక స్ఫూర్తికి అద్దం పట్టేలా, జాబితాలోని భారతీయ పారిశ్రామికవేత్తలలో 83 శాతం మంది తొలితరం వారేనని నివేదిక పేర్కొంది. వీరిలో సాఫ్ట్‌వేర్ ఉత్పత్తులు, సేవల రంగం నుంచి అత్యధికంగా 40 మంది ఉండగా, ఆ తర్వాత హెల్త్‌కేర్ (18), రవాణా (16), ఆర్థిక సేవల (15) రంగాల వారు ఉన్నారు. ఈ యువ పారిశ్రామికవేత్తల సంస్థల మొత్తం విలువ 357 బిలియన్ డాలర్లు కాగా, ఇవి 4.43 లక్షల మందికి పైగా ఉపాధి కల్పిస్తున్నాయి. 'ఈ తరం పారిశ్రామికవేత్తలు ఇప్పటికే దేశ జీడీపీ, ఉపాధి కల్పనలో కీలక పాత్ర పోషిస్తున్నారు' అని అవెండస్ వెల్త్ మేనేజ్‌మెంట్ ఎండీ అండ్ సీఈవో అపూర్వ సాహిజ్వానీ తెలిపారు.

విద్యాసంస్థల పరంగా చూస్తే, ఐఐటీ ఖరగ్‌పూర్ నుంచి 15 మంది పూర్వ విద్యార్థులు ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. మహిళా ప్రాతినిధ్యంలో మాత్రం చైనా (29) ముందుండగా, భారత్ నుంచి 15 మంది మహిళలు ఉన్నారు.
Indian Entrepreneurs
Young billionaires
India
China
UK
Aventus Wealth Management
Hurun India
Startups
Bengaluru
IIT Kharagpur

More Telugu News