Chandrababu Naidu: ఇజ్రాయెల్ ప్రతినిధులతో చంద్రబాబు భేటీ

Chandrababu Meets with Israel Representatives
  • ఇజ్రాయెల్ వాణిజ్య, పరిశ్రమల మంత్రితో చంద్రబాబు సమావేశం
  • సాంకేతిక సహకారం అందించాలని కోరిన చంద్రబాబు
  • డ్రోన్ టెక్నాలజీపై సహకారం కోరిన సీఎం

రాజధాని అమరావతిని సైబర్ సెక్యూరిటీ నగరంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో సీఎం చంద్రబాబు అంతర్జాతీయ స్థాయిలో ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు దావోస్‌లో ఉన్న సీఎం, ఈ క్రమంలో ఇజ్రాయెల్ వాణిజ్య, పరిశ్రమల మంత్రి నిర్ బర్కత్, ఆ దేశ ట్రేడ్ కమిషనర్ రాయ్ పిషర్‌తో కీలక సమావేశం నిర్వహించారు.


ఈ భేటీలో రాష్ట్రాభివృద్ధికి అవసరమైన పలు రంగాల్లో ఇజ్రాయెల్ సాంకేతిక సహకారం అందించాలని సీఎం చంద్రబాబు కోరారు. ముఖ్యంగా అమరావతిని అత్యాధునిక సైబర్ సెక్యూరిటీ నగరంగా తీర్చిదిద్దడంలో ఇజ్రాయెల్ అనుభవాన్ని వినియోగించుకోవాలని భావిస్తున్నామని తెలిపారు.


అలాగే విశాఖ–చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్‌లో యూఏవీ డ్రోన్ల తయారీ, తీరప్రాంత భద్రత కోసం డ్రోన్ల వినియోగం, వ్యవసాయ రంగానికి అనువైన డ్రోన్ టెక్నాలజీపై సహకారం కోరారు. అంతేకాకుండా వ్యర్థ జలాల రీసైక్లింగ్‌, వాటర్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీ రంగాల్లోనూ కలిసి పనిచేయాలన్న ప్రతిపాదనలు చేశారు. ఈ సమావేశంతో ఆంధ్రప్రదేశ్‌లో ఆధునిక సాంకేతిక పెట్టుబడులు పెరిగే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వం భావిస్తోంది. ఇజ్రాయెల్ ప్రతినిధులు కూడా సహకారంపై సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.

Chandrababu Naidu
Amaravati
Israel
Cyber Security City
Andhra Pradesh
Visakhapatnam Chennai Industrial Corridor
UAV Drones
Water Management
Nir Barkat
Roy Fisher

More Telugu News