జొమాటో మాతృసంస్థ ఎటర్నల్ సీఈవో పదవికి దీపిందర్ రాజీనామా.. ఎందుకంటే?

  • 2026 ఫిబ్రవరి 1 నుంచి రాజీనామా అమల్లోకి వస్తుందని వెల్లడి
  • గోయల్ వారసుడిగా బ్లింకిట్ సీఈవో అల్బీందర్ దిండ్సా
  • ఫిబ్రవరి 1న బాధ్యతలు చేపట్టనున్న దిండ్సా
ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో, గ్రాసరీ దిగ్గజం బ్లింకిట్ మాతృ సంస్థ ఎటర్నల్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో దీపిందర్ గోయల్ తన పదవికి రాజీనామా చేసినట్లు స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేశారు. తన రాజీనామా 2026 ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని ఆయన పేర్కొన్నారు.

ఆయన స్థానంలో బ్లింకిట్ సీఈవో అల్బీందర్ దిండ్సాను గోయల్ వారసుడిగా కంపెనీ ప్రకటించింది. ఫిబ్రవరి 1న అల్బీందర్ దిండ్సా ఎటర్నల్ కంపెనీ సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్నారు.

తన రాజీనామాకు గల కారణాలను దీపిందర్ గోయల్ వాటాదారులకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఇటీవల తాను అత్యధిక రిస్క్, ప్రయోగాలతో కూడిన అంశాల వైపు ఆకర్షితుడనయ్యానని, ఎటర్నల్ వంటి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలో ఉండి వాటిని కొనసాగించడం సరైనది కాదని రాజీనామా చేసినట్లు తెలిపారు. తన ఆలోచనలు కంపెనీ వ్యూహాలకు లోబడి ఉంటే తాను ఇక్కడే ఉండి పనిచేసేవాడినని పేర్కొన్నారు. అవి పూర్తిగా భిన్నమైనవని అన్నారు. అందుకే తాను బయటకు వెళ్లి తన కొత్త కలను సాకారం చేసుకోవాలని భావిస్తున్నానని ఆయన పేర్కొన్నారు.


More Telugu News