అది సిట్ కాదు.. పిచ్చి విచారణ: కేటీఆర్
- హరీశ్ రావు సిట్ విచారణపై కేటీఆర్ ఆగ్రహం
- అది సిట్ విచారణ కాదు, పిచ్చి విచారణ అని వ్యాఖ్య
- సింగరేణి టెండర్ల స్కాంలో సీఎం బావమరిది సూత్రధారి అని ఆరోపణ
- సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్
కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందని కేటీఆర్ విమర్శించారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేక, ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతోందని ఆరోపించారు. సింగరేణి టెండర్ల కుంభకోణంలో అసలు సూత్రధారి ముఖ్యమంత్రి బావమరిది సృజన్ రెడ్డేనని సంచలన ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.