Chiranjeevi: 'మన శంకర వరప్రసాద్ గారు' టిక్కెట్ ధరల పెంపు.. తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు

Chiranjeevi Mana Shankara Varaprasad Garu Ticket Price Hike Key Orders from Telangana High Court
  • టిక్కెట్ ధరల పెంపుపై హైకోర్టులో న్యాయవాది విజయ్ గోపాల్ పిటిషన్
  • టిక్కెట్ ధరల పెంపు ఉత్తర్వులను 90 రోజుల ముందే ఇవ్వాలని ఆదేశం
  • తెలంగాణ రాష్ట్ర హోంశాఖకు హైకోర్టు ఆదేశాలు
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు సినిమా టిక్కెట్ ధరల పెంపునకు సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై టిక్కెట్ ధరల పెంపు ఉత్తర్వులను 90 రోజుల ముందే ఇవ్వాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.

చిరంజీవి నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రం టిక్కెట్ ధరల పెంపు విషయంలో హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిపై కోర్టు ధిక్కరణ కేసు నమోదైంది. ఈ చిత్రం టిక్కెట్ ధరల పెంపు ఉత్తర్వులపై న్యాయవాది విజయ్ గోపాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

'రాజా సాబ్' చిత్రానికి సంబంధించి టిక్కెట్ ధరలపై ఈ నెల 9న వాదనలు జరిగాయని, 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రానికి టిక్కెట్ ధరలను పెంచుతూ అంతకుముందు రోజు 8న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించిన హైకోర్టు, తదుపరి విచారణను వాయిదా వేసింది. అదే సమయంలో ఇకపై టిక్కెట్ ధరల పెంపు ఉత్తర్వులను 90 రోజుల ముందే ఇవ్వాలని ఆదేశించింది.
Chiranjeevi
Mana Shankara Varaprasad Garu
Telangana High Court
Movie ticket prices
Ticket price hike

More Telugu News