Bochu Pedda Veerabhadradu: రామాలయానికి రూ.2 కోట్ల విరాళం ఇచ్చిన పిల్లలు లేని వృద్ధ దంపతులు

Childless Elderly Couple Donates Rs 2 Crore to Ramalayam
  • నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం జయదుర్గం గ్రామంలో జరిగిన ఘటన
  • రూ.2కోట్ల విలువైన ఆస్తిని మాధవరం రామాలయానికి విరాళం అందజేసిన వీరభద్రుడు, వెంకటేశ్వరమ్మ దంపతులు 
  • గ్రామస్తులు దాతలను ఊరేగించి ఘనంగా సత్కరించిన వైనం
నంద్యాల జిల్లా, ప్యాపిలి మండలం, జయదుర్గం గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకున్నారు. సంతానం లేని బొచ్చు పెద్ద వీరభద్రుడు, వెంకటేశ్వరమ్మ దంపతులు తమకు చెందిన సుమారు రూ. 2 కోట్ల విలువైన ఆస్తిని మాధవరం రామాలయానికి విరాళంగా అందజేశారు.

గ్రామ పెద్దల సమక్షంలో ఆస్తికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియను అధికారికంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు వృద్ధ దంపతుల సేవా నిరతిని కొనియాడుతూ, గ్రామంలో ఊరేగించి ఘనంగా సత్కరించారు. 

Bochu Pedda Veerabhadradu
Ramalayam
Nandyala district
Jayadurga village
Philanthrophy
Old couple donation
Madhavaaram Ramalayam
Andhra Pradesh temples
Real estate donation

More Telugu News