పొగమంచు ఎఫెక్ట్ తో స్కూలు టైమింగ్స్ మార్చిన కలెక్టర్.. ఎక్కడంటే..!
- ఉత్తరాదిని వణికిస్తున్న చలి.. నగరాలనూ కప్పేస్తున్న పొగమంచు
- యూపీలోని గౌతమ్ బుద్ద నగర్ జిల్లాలో స్కూలు టైమింగ్స్ లో మార్పులు
- ఉదయం 10 గంటలకు తెరిచి మధ్యాహ్నం 3 గంటలకు క్లోజ్ చేయాలని కలెక్టర్ ఆదేశాలు
అన్ని తరగతుల విద్యార్థులకు ఇవే టైమింగ్స్ పాటించాలని స్కూలు యాజమాన్యాలను ఆదేశించారు. ఈమేరకు నిన్న ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్.. ఈ రోజు (సోమవారం) నుంచి ఈ ఆదేశాలను అమలు చేయాలని సూచించారు. కాగా, యూపీలో ఉష్ణోగ్రతలు 5 డిగ్రీల నుంచి 7 డిగ్రీల వరకు నమోదవుతున్నాయని, సాధారణ ఉష్ణోగ్రతల కన్నా ఇది 1.6 డిగ్రీల నుంచి 3 డిగ్రీల వరకు తక్కువని వాతావరణ శాఖ పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా కోల్డ్ వేవ్ పరిస్థితులు నెలకొన్నాయని వివరించింది. ఉదయం పూట దట్టమైన పొగమంచు కురుస్తుండటంతో విజిబిలిటి తక్కువగా నమోదవుతోందని తెలిపింది.