UP schools: పొగమంచు ఎఫెక్ట్ తో స్కూలు టైమింగ్స్ మార్చిన కలెక్టర్.. ఎక్కడంటే..!

Fog Causes School Timing Changes in Gautam Buddha Nagar
  • ఉత్తరాదిని వణికిస్తున్న చలి.. నగరాలనూ కప్పేస్తున్న పొగమంచు
  • యూపీలోని గౌతమ్ బుద్ద నగర్ జిల్లాలో స్కూలు టైమింగ్స్ లో మార్పులు
  • ఉదయం 10 గంటలకు తెరిచి మధ్యాహ్నం 3 గంటలకు క్లోజ్ చేయాలని కలెక్టర్ ఆదేశాలు
ఉత్తరాది రాష్ట్రాల్లో చలి వణికిస్తోంది. పల్లెలతో పాటు నగరాలనూ పొగమంచు కప్పేస్తోంది. ఉదయంపూట దట్టమైన పొగమంచు కారణంగా ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉత్తరప్రదేశ్ లోని గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలో పొగమంచు దట్టంగా కురుస్తోంది. దీంతో కలెక్టర్ స్పందించి స్కూలు టైమింగ్స్ ను మార్చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఉదయం 10 గంటలకు తెరవాలని, మధ్యాహ్నం 3 గంటలకల్లా క్లోజ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

అన్ని తరగతుల విద్యార్థులకు ఇవే టైమింగ్స్ పాటించాలని స్కూలు యాజమాన్యాలను ఆదేశించారు. ఈమేరకు నిన్న ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్.. ఈ రోజు (సోమవారం) నుంచి ఈ ఆదేశాలను అమలు చేయాలని సూచించారు. కాగా, యూపీలో ఉష్ణోగ్రతలు 5 డిగ్రీల నుంచి 7 డిగ్రీల వరకు నమోదవుతున్నాయని, సాధారణ ఉష్ణోగ్రతల కన్నా ఇది 1.6 డిగ్రీల నుంచి 3 డిగ్రీల వరకు తక్కువని వాతావరణ శాఖ పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా కోల్డ్ వేవ్ పరిస్థితులు నెలకొన్నాయని వివరించింది. ఉదయం పూట దట్టమైన పొగమంచు కురుస్తుండటంతో విజిబిలిటి తక్కువగా నమోదవుతోందని తెలిపింది.
UP schools
school timings
fog effect
cold wave
Uttar Pradesh weather
winter
India weather
district collector
Gautam Buddha Nagar

More Telugu News