పవన్ కల్యాణ్ చెప్పారనే ఆంధ్రాలో సినిమా షూటింగ్: నవీన్ పొలిశెట్టి

  • ఏపీలో కూడా సినిమాల చిత్రీకరణ జరగాలని పవన్ కల్యాణ్ చెప్పారన్న నవీన్ పొలిశెట్టి
  • పవన్ వ్యాఖ్యలు తన మనసును హత్తుకున్నాయని వెల్లడి
  • షూటింగ్‌కు అన్ని చోట్ల సులువుగా అనుమతులు ఇచ్చారన్న నవీన్ పొలిశెట్టి
'అనగనగా ఒక రాజు' సినిమా చిత్రీకరణలో అధికభాగం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోనే ఎందుకు జరిగిందనే విషయాన్ని నటుడు నవీన్ పొలిశెట్టి వెల్లడించారు. చిత్రబృందం నిన్న రాజమహేంద్రవరంలో సందడి చేసింది. నగరంలోని అప్సర థియేటర్‌లో 'అనగనగా ఒక రాజు' సినిమా ప్రదర్శితమవుతుండగా నటుడు నవీన్ పొలిశెట్టి, నటి మీనాక్షి చౌదరి ప్రేక్షకుల మధ్యకు వచ్చి తమ సంతోషాన్ని పంచుకున్నారు.

ఈ సందర్భంగా నవీన్ పొలిశెట్టి మాట్లాడుతూ.. ఏపీలో కూడా సినిమా చిత్రీకరణలు జరగాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఒక కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు తన హృదయాన్ని తాకాయని అన్నారు. అందువల్లే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కువ శాతం చిత్రీకరణ జరపాలని నిర్ణయించుకుని పూర్తి చేశామని తెలిపారు.

చిత్రీకరణ ఎక్కడ చేసినా అధికారులు సులువుగా అనుమతులు ఇచ్చారని, పూర్తి సహకారం అందించారని ఆయన కొనియాడారు. స్థానిక ప్రజలు కూడా ఎంతో ఉత్సాహంగా ప్రోత్సహించారని పేర్కొన్నారు. సినిమా విజయవంతం కావడం పట్ల నటి మీనాక్షి చౌదరి ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. 


More Telugu News