Shubman Gill: శుభ్‌మన్ గిల్ ఎక్కడికి వెళ్లినా ఇది ఉండాల్సిందే!
- ఇండోర్ హోటల్లో గిల్ సొంత వాటర్ ప్యూరిఫైయర్
- దీని విలువ సుమారు రూ. 3 లక్షలు
- కలుషిత నీటి భయంతోనే అని మొదలైన ప్రచారం
- ఫిట్‌నెస్‌లో భాగంగానే ఈ ఏర్పాటు అని తేల్చిన నివేదికలు
- డెంగ్యూ తర్వాత కఠిన హైడ్రేషన్ ప్రమాణాలు పాటిస్తున్న గిల్
టీమిండియా యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ గురించి ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇండోర్‌లో బస చేస్తున్న హోటల్ గదిలో అతడు ప్రత్యేకంగా ఓ వాటర్ ప్యూరిఫైయర్‌ను ఏర్పాటు చేసుకోవడమే దీనికి కారణం. అయితే, ఇండోర్‌లోని నీళ్లు కలుషితమయ్యాయన్న భయంతోనే గిల్ ఈ నిర్ణయం తీసుకున్నాడనే ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టమవుతోంది.
భారత్, న్యూజిలాండ్ మధ్య సిరీస్ డిసైడర్ వన్డే కోసం ఇండోర్ వచ్చిన గిల్, తన గదిలో సుమారు రూ.3 లక్షల విలువైన ఆల్కలైన్ వాటర్ RO ప్యూరిఫైయర్‌ను ఏర్పాటు చేయించుకున్నాడు. ఇటీవల ఇండోర్‌లోని కొన్ని ప్రాంతాల్లో కలుషిత నీటి కారణంగా పలువురు అనారోగ్యం పాలై, మరణించినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే గిల్ తన ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఈ చర్య తీసుకున్నాడని కథనాలు వెలువడ్డాయి.
అయితే, క్రిక్‌బజ్ కథనం ప్రకారం ఈ వాదనల్లో నిజం లేదు. ఈ ప్యూరిఫైయర్ వాడకం అనేది గిల్ వ్యక్తిగత ఫిట్నెస్ ప్రణాళికలో ఒక భాగం మాత్రమే. ఇటీవల డెంగ్యూ నుంచి కోలుకున్న తర్వాత, అతను తాగునీటి విషయంలో చాలా కఠినమైన ప్రమాణాలను పాటిస్తున్నాడు. అందులో భాగంగానే ఈ ప్యూరిఫైయర్‌ను వినియోగిస్తున్నట్లు ఆ కథనం స్పష్టం చేసింది. గిల్ ఎక్కడికి వెళ్లినా ఈ ప్యూరిఫయర్ ను కూడా తీసుకెళుతున్నాడని పేర్కొంది. కేవలం గిల్ మాత్రమే కాదు, చాలా మంది అగ్రశ్రేణి క్రీడాకారులు తమ ఫిట్నెస్, ఆరోగ్యం కోసం ఇలాంటి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం సాధారణమేనని క్రీడా వర్గాలు చెబుతున్నాయి.