హైదరాబాద్‌లో హాట్ ఎయిర్ బెలూన్ ల్యాండింగ్‌పై గందరగోళం
- సంక్రాంతి వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన బెలూన్ ఫెస్టివల్‌లో అపశ్రుతి
- నెక్నాంపూర్ చెరువు వద్ద కిందకు దిగిన ఓ హాట్ ఎయిర్ బెలూన్
- సాంకేతిక లోపంతోనే ల్యాండింగ్ అని ప్రచారం, కాదన్న నిర్వాహకులు
- ప్రయాణికులంతా సురక్షితం, ఎలాంటి ప్రమాదం జరగలేదని వెల్లడి
హైదరాబాద్‌లో తెలంగాణ పర్యాటక శాఖ నిర్వహిస్తున్న హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్‌లో రెండో రోజైన శనివారం స్వల్ప గందరగోళం నెలకొంది. గోల్కొండ గోల్ఫ్ క్లబ్ నుంచి గాల్లోకి లేచిన ఓ హాట్ ఎయిర్ బెలూన్, నార్సింగి పరిధిలోని ఇబ్రహీంబాగ్ పెద్ద చెరువు సమీపంలో ల్యాండ్ అవ్వడం కలకలం రేపింది. సాంకేతిక లోపం కారణంగానే బెలూన్‌ను అత్యవసరంగా దించాల్సి వచ్చిందని తొలుత వార్తలు వ్యాపించాయి. అయితే, ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఈ ప్రచారాన్ని ఈవెంట్ ఆపరేటర్ స్కై వాల్ట్జ్, పర్యాటక అభివృద్ధి సంస్థ (TGTDC) ఖండించాయి. ఇది అత్యవసర ల్యాండింగ్ కాదని, ప్రణాళిక ప్రకారం నియంత్రిత పద్ధతిలో సురక్షితంగా జరిపిన సాధారణ ల్యాండింగ్ అని స్పష్టత ఇచ్చాయి. హాట్ ఎయిర్ బెలూన్లు గాలి వాటాన్ని బట్టి ప్రయాణిస్తాయని, అనువైన ఖాళీ ప్రదేశాల్లో ల్యాండ్ చేయడం అంతర్జాతీయంగా అనుసరించే పద్ధతేనని వివరించాయి. బెలూన్‌లో ఇద్దరు జర్నలిస్టులు, ఒక టెక్నీషియన్ ఉన్నారు.
మరోవైపు, పరేడ్ గ్రౌండ్ నుంచి బయలుదేరిన మరో బెలూన్ కూడా సాంకేతిక కారణాలతో మంచిరేవులలోని ఆలయ ప్రాంగణంలో ల్యాండ్ అయినట్లు సమాచారం. ఈ ఘటనలపై ఎలాంటి ఫిర్యాదులు అందలేదని, అందువల్ల కేసులు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు. ఇది ప్రభుత్వ కార్యక్రమమని పేర్కొన్నారు. మొత్తంగా రెండు ఘటనల్లోనూ ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.