మరి, మచాడోకు ట్రంప్ రిటర్న్ గిఫ్ట్ ఏమిచ్చారంటే..!

  • రెడ్ కలర్ బ్యాగ్ తో వైట్ హౌస్ వీడిన మచాడో
  • తన ప్రత్యేక అతిథులకు రెడ్ బ్యాగ్ అందించడం ట్రంప్ కు ఆనవాయతీ
  • అందులో ట్రంప్ కు ఇష్టమైన కోక్ బాటిల్ సహా పలు వస్తువులు ఉంటాయని సమాచారం
వెనెజువెలా ప్రతిపక్ష నేత మరియా కొరినా మచాడోను ఈ ఏడాది నోబెల్ శాంతి పురస్కారం వరించిన విషయం తెలిసిందే. అయితే, మచాడో ఈ అవార్డును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు అందజేశారు. ప్రపంచ దేశాల మధ్య ఇటీవల జరిగిన 8 యుద్ధాలను ట్రంప్ ఆపేశాడని, ఈ పురస్కారం ఆయనకే చెందాలని మచాడో ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అమెరికాలో పర్యటించిన మచాడో.. వైట్ హౌస్ లో తన నోబెల్ శాంతి బహుమతి మెడల్ తో పాటు వెనెజువెలా ప్రజల తరఫున ఓ లేఖను కూడా ట్రంప్ కు అందజేశారు.

నోబెల్ శాంతి బహుమతి ఆశించి భంగపడ్డ ట్రంప్ కు ఈ చర్య ఎంతగానో సంతోషాన్నిచ్చింది. అద్భుతమైన మహిళ అంటూ మచాడోను పొగడ్తలతో ముంచెత్తిన ట్రంప్.. ఆమెకు ఓ రెడ్ బ్యాగ్ ను కానుకగా అందజేశారు. వైట్ హౌస్ నుంచి మచాడో తిరిగి వెళుతున్నపుడు ఆమె చేతుల్లో కనిపించిన రెడ్ బ్యాగ్ లో ఏముందనేది ఆసక్తికరంగా మారింది. ఈ విషయంపై అధికారికంగా ట్రంప్ కానీ మచాడో కానీ ఏ విషయం వెల్లడించలేదు. అయితే, ట్రంప్ తనకోసం వైట్ హౌస్ కు వచ్చే ప్రత్యేక అతిథులకు ఈ రెడ్ బ్యాగ్ ను గిఫ్ట్ గా అందిస్తారు.

ట్రంప్ రెడ్ బ్యాగ్ లో ఏముంటాయంటే..
  • మేక్ అమెరికా గ్రేట్ అగైన్ క్యాప్షన్, ట్రంప్ సంతకంతో కూడిన రెడ్ కలర్ క్యాప్
  • 2025 జనవరి 20వ తేదీ ముద్రించిన డైట్ కోక్ బాటిల్
  • అమెరికా క్యాపిటల్ భవనం స్కెచ్‌తో, బంగారు అక్షరాలు ముద్రించిన ఎరుపు రంగు లెదర్ డైరీ
  • ట్రంప్, జేడీ వాన్స్ బొమ్మలతో కూడిన మెడల్
  • వైట్ హౌస్ కీ చైన్, క్రిస్మస్ ఆర్నమెంట్
  • ట్రంప్ ముఖచిత్రంతో కూడిన నకిలీ 100 డాలర్ల నోటు
  • ఒక చిన్న గోల్డ్ పిన్


More Telugu News