Nara Lokesh: ఈ సాయంత్రం 6 గంటలకు ఒక ముఖ్య ప్రకటన ఉంటుంది: మంత్రి నారా లోకేశ్ నుంచి ఇంట్రెస్టింగ్ ట్వీట్

Nara Lokesh Announces Major Announcement Today at 6 PM
  • కాకినాడలో భారీ ప్రాజెక్టు
  • ఏపీ మరో సౌదీ అరేబియా అవుతుందన్న లోకేశ్
  • జర్మనీ, జపాన్, సింగపూర్ దేశాలకు కాకినాడ నుంచి ఎగుమతులు జరుగతాయంటూ ట్వీట్
రేపు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం గ్రీన్ ఎనర్జీ రంగంలో మరో సౌదీ అరేబియాగా అవతరించే క్షణాలు రానున్నాయంటూ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ చేసిన ట్వీట్ రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించింది. కాకినాడలో 10 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 83,400 కోట్లు) భారీ పెట్టుబడితో, 8 వేల ఉద్యోగాలే లక్ష్యం అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు. ఇక్కడ్నించి జర్మనీ, జపాన్, సింగపూర్ దేశాలకు ఎగుమతులు జరుగుతాయని తెలిపారు. 

దీనికి సంబంధించి ఈ రోజు సాయంత్రం 6 గంటలకు కీలక ప్రకటన ఉంటుందని లోకేశ్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. ఈ మేరకు 'కాకికాడ నుంచి ప్రపంచానికి' అనే క్యాప్షన్ తో పోస్ట్ పెట్టారు.
Nara Lokesh
Andhra Pradesh
Green Energy
Kakinada
Investment
Saudi Arabia
Exports
Germany
Japan
Singapore

More Telugu News