Aamir Khan: హిందీలో మాట్లాడాలా... ఇది మహారాష్ట్ర భాయ్!: ఆమిర్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్య

Aamir Khan Remarks on Speaking Hindi in Maharashtra
  • మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఓటు వేసిన ఆమిర్ ఖాన్
  • అందరూ ఓటు వేయాలని మరాఠీలో చెప్పిన ఆమిర్ ఖాన్
  • హిందీలో చెప్పాలని మీడియా ప్రతినిధి కోరడంతో ఆమిర్ ఖాన్ వ్యాఖ్య
ముంబైలో జరిగిన బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల సందర్భంగా నటుడు ఆమిర్ ఖాన్ ఓటు వేయడానికి వచ్చి తన పౌర విధిని నిర్వర్తించారు. అయితే, తన సందేశాన్ని హిందీలో పునరావృతం చేయమని అడిగినప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. మున్సిపల్ ఎన్నికల్లో ఆమిర్ ఖాన్ ఓటు వేశారు. ఓ మీడియా ప్రతినిధి ఆయనను మాట్లాడాలని కోరారు.

అందరూ ఓటు వేయాలని ఆమిర్ ఖాన్ మరాఠీలో చెబుతుండగా, ఒక రిపోర్టర్ హిందీలో చెప్పాలని కోరారు. దీనికి నటుడు స్పందిస్తూ, "హిందీలో మాట్లాడాలా, ఇది మహారాష్ట్ర భాయ్" (యే మహారాష్ట్రా హై భాయ్) అని వ్యాఖ్యానించారు. స్పందించిన ఆ విలేకరి ఇది ఢిల్లీలో కూడా ప్రసారమవుతుందని, అందుకే హిందీలో చెప్పమన్నానని పేర్కొన్నారు. ఢిల్లీ దాకా వెళుతుందా... చాలా ఏర్పాట్లు చేశారు... అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నానంటూ పేర్కొన్నారు.

గతేడాది ఏప్రిల్‌లో మహారాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో హిందీని మూడో భాషగా చేర్చాలని నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి మరాఠీ వర్సెస్ హిందీ భాషపై చర్చ ప్రారంభమైంది. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నప్పటికీ చర్చ మాత్రం కొనసాగుతోంది. ఇటీవల నటి కాజోల్ హిందీలో మాట్లాడేందుకు నిరాకరించి విమర్శలు ఎదుర్కొన్నారు.
Aamir Khan
Maharashtra
Mumbai
Municipal Elections
Voting
Marathi Language
Hindi Language

More Telugu News