Sai Pallavi: సాయి పల్లవి తొలి హిందీ సినిమా పోస్టర్ పై కాపీ ఆరోపణలు

Sai Pallavis Ek Din faces plagiarism accusations upon release
  • సాయి పల్లవి తొలి హిందీ చిత్రం ‘ఏక్ దిన్’ ఫస్ట్ లుక్ విడుదల
  • ఒరిజినల్ థాయ్ సినిమా పోస్టర్‌ను కాపీ కొట్టారని తీవ్ర విమర్శలు
  • టైటిల్‌ను కూడా యథాతథంగా అనువదించారని నెటిజన్ల ఆరోపణ
  • ఈ చిత్రంలో ఆమిర్‌ఖాన్ కుమారుడు జునైద్‌ఖాన్ హీరో
  • మే 1న సినిమా విడుదల చేయనున్నట్టు ప్రకటించిన చిత్రబృందం
ప్రముఖ నటి సాయి పల్లవి హిందీలో అరంగేట్రం చేస్తున్న ‘ఏక్ దిన్’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైన వెంటనే వివాదంలో చిక్కుకుంది. గురువారం చిత్రబృందం విడుదల చేసిన ఈ పోస్టర్‌పై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆమిర్‌ఖాన్ కుమారుడు జునైద్‌ఖాన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా పోస్టర్‌ను ఒక థాయ్ సినిమా నుంచి అచ్చుగుద్దినట్టు కాపీ కొట్టారని నెటిజన్లు ఆరోపిస్తున్నారు.

ఈ చిత్రం ఒక థాయ్ సినిమాకు అధికారిక రీమేక్ అని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో, ఒరిజినల్ సినిమా పోస్టర్‌నే ఎలాంటి మార్పులు లేకుండా వాడేశారని, చివరికి హిందీ టైటిల్ ‘ఏక్ దిన్’ కూడా అసలు సినిమా టైటిల్‌కు అనువాదమేనని రెడిట్ వంటి సోషల్ మీడియా వేదికల్లో యూజర్లు కామెంట్లు పెడుతున్నారు. "ఒరిజినల్ సినిమా పోస్టర్‌నే వాడేశారు. టైటిల్‌ను కూడా అనువదించి పెట్టేశారు" అని ఒక యూజర్ పేర్కొనగా, "కొత్తగా ఏదైనా ప్రయత్నించి ఉండాల్సింది కదా?" అని మరో యూజర్ అభిప్రాయపడ్డారు.

సునీల్ పాండే దర్శకత్వం వహిస్తున్న ఈ రొమాంటిక్ డ్రామాను ఆమిర్‌ఖాన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. మే 1న ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఫస్ట్ లుక్‌తోనే కాపీ ఆరోపణలు రావడం సినిమాపై చర్చకు దారితీసింది. అయితే, ఈ విమర్శలపై చిత్ర దర్శక నిర్మాతలు ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.
Sai Pallavi
Ek Din
Sai Pallavi Hindi Debut
Aamir Khan Productions
Junaid Khan
Bollywood
Copy allegations
Thai movie remake
Sunil Pandey
Movie poster controversy

More Telugu News