కొత్త లుక్ లో జూనియర్ ఎన్టీఆర్

  • ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'డ్రాగన్' సినిమా చేస్తున్న తారక్
  • శరవేగంగా జరుగుతున్న షూటింగ్
  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో కెమెరా కంటికి చిక్కిన ఎన్టీఆర్
టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ 'ఆర్ఆర్ఆర్' సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా అవతరించాడు. ఆ తర్వాత వచ్చిన 'దేవర' మూవీతో ప్రేక్షకుల నుంచి మరోసారి మంచి స్పందనను అందుకున్నాడు. ఆ తర్వాత హృతిక్ రోషన్ తో కలిసి బాలీవుడ్ మూవీ 'వార్ 2'లో నటించాడు. ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను అలరించలేకపోయినప్పటికీ... తారక్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'డ్రాగన్' సినిమాలో ఎన్టీఆర్ నటిస్తున్నాడు. ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. 

అయితే, ఈ సినిమాలో తారక్ లుక్ ఎలా ఉండబోతోందనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. తాజాగా, కొత్త లుక్ లో శంషాబాద్ ఎయిర్ పోర్టులో జూనియర్ ఎన్టీఆర్ కెమెరాల కంటికి చిక్కాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 


More Telugu News